మాల్దీవుల్లో ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్

0

రామ్ చరణ్ – ఉపాసన జోడీ జాలీ ట్రిప్ సెలబ్రేషన్స్ గురించి తెలిసిందే. బర్త్ డే .. వెడ్డింగ్ డే.. అంటూ ప్రతిసారీ ఏదో ఒక స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఎగ్జోటిక్ లొకేషన్లకు వెళ్లి ఎంజాయ్ చేయడం వీళ్లకో హ్యాబిట్. భార్యకు విదేశీ ట్రిప్ లతో సర్ ప్రైజ్ ట్రీటివ్వడం చెర్రీకి ఆటవిడుపు. ప్రతిసారీ రామ్ చరణ్ ని ఉద్ధేశించి సామాజిక మాధ్యమాల్లో ఉపాసన కురిపించే ప్రేమాభిమానాలు అభిమానుల్లో చర్చకొస్తున్నాయి. నిన్నటిరోజున చరణ్ ఓ రెండు ఫోటోల్ని షేర్ చేసి `హ్యాపి బర్త్ డే మై ప్రిన్సెస్` అంటూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు తననుంచి రిప్లయ్ ఆకట్టుకుంది. థాంక్యూ మై ప్రిన్స్.. నీవు లేని జీవితాన్ని ఊహించలేను! అంటూ ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.

ఉపాసన బర్త్ డే సందర్భంగా చెర్రీ అప్పటికప్పుడే సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారట. కొందరు బంధు మిత్రుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు. ఆ మూవ్ మెంట్ ని ఉపాసన ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు.. ఉపాసన బర్త్ డే సందర్భంగా చరణ్ మాల్దీవుల్లో ప్రీ వెకేషన్ ప్లాన్ చేశారన్నది మరో హాట్ న్యూస్. మాల్దీవుల్లో సముద్ర జలాలపై ఈ జంట విహరించారు. అక్కడ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లోకి రిలీజయ్యాయి. ఇదివరకూ వెడ్డింగ్ డే ని సెలబ్రేట్ చేసినట్టే ఈసారి కూడా ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ని చరణ్ ప్లాన్ చేశారట.

పరిశ్రమలో స్టార్ హీరోగా రామ్ చరణ్ కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీ. అతడు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో కాస్త సమయం చిక్కగానే ఇలా మాల్దీవులకు ఉపాసనతో సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారట. ఇదివరకూ ఆఫ్రికాలో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసినట్టే బర్త్ డే ని ప్లాన్ చేశారు. ఆఫ్రికా అడవుల్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈసారి ప్రీబర్త్ డే సెలబ్రేషన్స్ అంతే దూసుకెళుతున్నాయి.
Please Read Disclaimer