ఆరెంజ్ లాంటి మరో లవ్ స్టోరీ?

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఏకైక లవ్ స్టోరీ `ఆరెంజ్`. ఆ ప్రయత్నం ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో తెలిసిందే. అయినా చెర్రీ ఇప్పటికీ ఆరెంజ్ తన కెరీర్ లోనే ఓ స్పెషల్ మూవీ అని చెబుతూ ఉంటాడు. ఆడియన్ మెచ్చినా మెచ్చకపోయినా తన మనసుకు నచ్చిన చిత్రమిదని చెర్రీ చెబుతుంటారు. కానీ ఆ ప్లాప్ తర్వాత మళ్లీ లవ్ జానర్ నే టచ్ చేయలేదు. కమర్శియల్ సినిమాలతోనే ఇంతింతై 200 కోట్ల క్లబ్ హీరోగా ఎదిగాడు. కానీ ప్రేమ కావ్యాలు చేయలేదన్న లోటును ఎప్పటికీ ఫీలవుతూనే ఉంటారట.

మణిరత్నం లాంటి స్టార్ మేకర్ అవకాశమిచ్చినా చరణ్ ధైర్యం చేయలేకపోయాడంటే.. కమర్శియల్ కాన్సెప్ట్ లకి ఎంతగా బౌండ్ అయిపోయాడో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా వాటన్నింటిని ఓవర్ కమ్ చేసి మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే `మళ్లీ రావా`- `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ స్క్రిప్ట్ వినిపించినట్లు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అతడు ఓ ప్యూర్ లవ్ స్టోరీని వినిపించారని తాజాగా రివీలైంది.

ఇది నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఉత్తరాది (పంజాబీ) అమ్మాయి.. దక్షిణాది అబ్బాయి మధ్య ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని గౌతమ్ వినిపించారట. ఈ పాయింట్ పాన్ ఇండియా అప్పీల్ తో చరణ్ కి యూనిక్ గా అనిపించి లాక్ చేసినట్లు చెబుతున్నారు. ఇక గౌతమ్ మేకింగ్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలి ఎమోషన్ ని పీక్స్ లో చూపించగలడని ఇప్పటికే ప్రూవైంది. మళ్లీ రావా.. జెర్సీ చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు దక్కడం వెనక గౌతమ్ సెన్సిబిలిటీస్ ఓ కారణం. తాజాగా చెర్రీకి వినిపించిన ప్రేమకథలోనూ ఆ ఎమోషన్ కామన్ గా ఉంటుందట. మరి ఈ జెడీ ఎప్పుడు సెట్స్ కి వెళతారు? సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చరణ్ లిస్ట్ లో ప్రదీప్ అనే కొత్త కుర్రాడు ఉన్నాడు. ఇటీవలే స్క్రిప్టు వినిపించి లాక్ చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఇంతలో గౌతమ్ తో కథ ఓకే అయ్యిందన్న మాట వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ ఆ ఇద్దరిలో ఎవరికి కాల్షీట్లు కేటాయిస్తాడో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-