చరణ్ ఆ డైరెక్టర్ ని లాక్ చేశాడా?

0

2020 క్రేజీ పాన్ ఇండియా మూవీగా ఆర్.ఆర్.ఆర్ పాపులరైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ .. తారక్ ఏఏ దర్శకుల తో పని చేస్తారు? అంటూ ఆరాలు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ .. మెర్సల్ ఫేం అట్లీ.. త్రివిక్రమ్ వంటి స్టార్ డైరక్టర్ల కు లైన్ క్లియర్ చేశాడని ప్రచారమవుతోంది. అయితే దేనిపైనా పూర్తి క్లారిటీ లేదు. అలాగే రామ్ చరణ్ పైనా ఈ తరహా ప్రచారం వేడెక్కిస్తోంది.

ఇప్పటికే చరణ్ తో పని చేసేందుకు పలువురు దర్శకులు క్యూలో ఉన్నారు. అందులో అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా.. గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ ఫ్రంట్ రన్నర్స్ గా రేసులో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఆ ఇద్దరూ ఫైనల్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారని కానీ.. చరణ్ ప్రీప్రొడక్షన్ చేసుకోమని అన్నారని కానీ క్లారిటీ లేదు. అయినా హరీష్ కి అతడు ఓకే చెప్పేశాడు అంటూ కాన్ఫిడెంట్ గా ప్రచారం సాగిస్తుండడం చూస్తే ఇది నిజమేనా? అంటూ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన హరీష్ అటుపైనా వరుస గా మెగా హీరోలతో సినిమాలు చేశారు. బన్నితో డీజే.. సాయి తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్.. వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాల్ని తెరకెక్కించాడు. ఆ క్రమంలోనే అతడికి మెగా డైరెక్టర్ అన్న పేరొచ్చింది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్.. సుబ్రమణ్యం ఫర్ సేల్ యావరేజ్.. గద్దల కొండ గణేష్ ఎబౌ యావరేజ్ గా ఆడాయి. ఇక మెగా హీరోల్లోనే మరో క్రేజీ హీరో చరణ్ ని డైరెక్ట్ చేయాలన్నది హరీష్ ప్లాన్. అయితే అది ఇన్నాళ్లు వాయిదా పడుతూ వస్తోంది. కానీ గద్దలకొండ గణేష్ తర్వాత చెర్రీని గట్టిగానే ఓ పట్టు పట్టాలని నిర్ణయించుకున్నాడో ఏమో స్క్రిప్టు ను రెడీ చేస్తున్నాడట. మరి ఇది నిజం అని నమ్మాలంటే ఠెంకాయ కార్యక్రమమే శరణ్యం. మరి హరీష్ అంతవరకూ తీసుకెళతాడా? అన్నది చూడాలి.
Please Read Disclaimer