`సైరా` వాయిదా .. ఇంకా చెర్రీ సైలెన్స్!?

0

`సాహో` తర్వాత అంతటి క్రేజీ ప్రాజెక్టుగా `సైరా: నరసింహారెడ్డి` చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బెస్ట్ గా ఉండాలనే పట్టుదలతో చిరుతనయుడు ఈ ప్రయత్నం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి- రామ్ చరణ్ బృందం ఈ భారీ హిస్టారికల్ వారియర్ సినిమా కోసం ఎంతగా శ్రమిస్తున్నారో చూస్తున్నదే. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు టీమ్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇంకో 20 శాతం వీఎఫ్ ఎక్స్ వర్క్ పూర్తయితే ఆల్మోస్ట్ అన్నిపనులు పూర్తయినట్టేనని సమాచారం అందుతోంది. అక్టోబర్ 2 రిలీజ్ డెడ్ లైన్ కి తగ్గట్టే పని సజావుగానే సాగుతోందట.

అయితే సరిగ్గా రిలీజ్ ముంగిట ఉన్నట్టుండి బాలీవుడ్ ట్రేడ్ లో ఉన్నట్టుండి వాయిదా ప్రచారం వేడెక్కించింది. హృతిక్ – టైగర్ ష్రాఫ్ నటించిన `వార్` చిత్రంతో పోటీ పడకుండా `సైరా`ను వాయిదా వేశారన్నదే ఆ ప్రచారం సారాంశం. అక్టోబర్ 2న `వార్` యథాతథంగా రిలీజవుతుంటే.. హిందీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు `సైరా`ను వారం పాటు వాయిదా వేస్తూ అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నారని ప్రచారమైంది. అయితే వాయిదా విషయాన్ని చరణ్ కానీ హిందీ పంపిణీదారులు కానీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయిదా ప్రచారాన్ని ఇంతవరకూ ఒక నిర్మాత హోదాలో రామ్ చరణ్ కానీ కొణిదెల కంపెనీ కానీ ఖండించనేలేదు.

దాదాపు 150-200 కోట్ల బడ్జెట్ తో సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాంటి క్రేజీ సినిమా వాయిదా అంటూ సాగిన ప్రచారానికి చెక్ పెట్టకుండా ఏం చేస్తున్నట్టు? ఉత్తరాదిన ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ ఈ ట్వీట్ చేసి డిలీట్ చేయడంపై చరణ్ ఇప్పటికీ స్పందించలేదు. నేటి మధ్యాహ్నం ఓ స్పెషల్ జెట్ లో నెల్లూరు సూళ్లూరు పేట వెళ్లిన చరణ్ అక్కడ ప్రభాస్ వీఎపిక్ థియేటర్ ని ప్రారంభించారు. అసలు `సైరా` వాయిదా నిజమా కాదా? అన్నదానిపై సామాజిక మాధ్యమాల్లో (ట్విట్టర్- ఇన్ స్టాగ్రమ్- ఎఫ్ బీ) చరణ్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈరోజు లేదా రేపు కానీ.. ఈ ప్రకటన వెలువడే వీలుందట. ఐదారు గంటలుగా ఇంకా స్థబ్ధత కొనసాగుతోంది. ఆ ఖండన ఎప్పుడు అన్నది చూడాలి. సైరా చిత్రాన్ని తెలుగు-తమిళం- హిందీ సహా పలు భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.




Please Read Disclaimer