ఆన్ లైన్ లో సైరా మూవీ… టెన్షన్ లో రాంచరణ్

0

ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా ఇండస్ట్రీని వదలట్లేదు పైరసీ భూతం. రోజురోజుకీ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా – పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ తాత్కాలికమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఈ పైరసీ పీడ తప్పట్లేదు. పెద్ద హీరోలు – భారీ బడ్జెట్ సినిమాల గురించి అయితే చెప్పక్కర్లేదు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలను మొదటి రోజు మార్నింగ్ షో అవ్వకుండానే పైరసీ చేసి బయటకి వదిలేస్తున్నారు పైరసీరాయుళ్లు.

నిన్న విడుదల అయిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమా అలా విడుదల అయ్యిందో లేదో కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్ లో దర్శనమిచ్చింది. ఈ చిత్ర నిర్మాత రాంచరణ్ ఎవరైనా పైరసీ చేస్తే తమకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మెయిల్ కి కొన్ని వేల కంప్లైంట్స్ రావడంతో రాంచరణ్ చాలా అసహనంగా ఉన్నాడు. ఎంతో కష్టపడి ఒక స్వాతంత్ర్య సమర యోధుని జీవితాన్ని సినిమాగా తీస్తే ఈ తలపోటు ఏంటని తలపట్టుకుంటున్నాడు. సైరా యూనిట్ మొత్తం దీనిపై చాలా సిరియస్ గా ఆలోచిస్తున్నారు. రాంచరణ్ అయితే ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టబోతున్నానని హెచ్చరించాడు. ఇలాంటి పైరసీకారుల వల్ల సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా కుటుంబాల వాళ్ళు రోడ్డున పడుతున్నారు.