మగధీర 10 ఇయర్స్ – చరణ్ రియాక్షన్

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు నిన్న చాలా స్పెషల్ డే. మగధీర విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీని గురించి భారీ ఎత్తున ట్రెండింగ్ నడుస్తోంది. రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ గురించి అది సాధించిన రికార్డుల గురించి అందరూ జ్ఞాపకాల దొంతరలోకి వెళ్తున్నారు. సినిమా చూసే అభిమానులకే ఇలా ఉంటే ఇక అందులో నటించి కెరీర్ బ్రేక్ అందుకున్న హీరో ఫీలింగ్స్ ఎలా ఉండాలి. ఇది పసిగట్టే రామ్ చరణ్ తన ఇన్స్ టాగ్రామ్ లో ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నాడు. తన మెసేజ్ యథాతథంగా ఇలా ఉంది

“అప్పుడే పదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ నిన్నో మొన్నో చేసినట్టు ఉంది. ఓ కలను నిజం చేసిన పెద్ద టీమ్ గీత ఆర్ట్స్ – అల్లు అరవింద్ – రాజమౌళిలకు చాలా చాలా థాంక్స్. మర్చిపోలేకపోతున్నా. రాజమౌళి గారు అప్పుడు మీతో ఎంతో నేర్చుకున్నా ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నా. ఇవే పదేళ్ల మగధీర గొప్ప జ్ఞాపకాలు”

దీంతో పాటు మగధీర సెట్స్ లో తాను రాజమౌళి ఉన్న పోస్టర్ ని షేర్ చేసుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు. నిజంగానే రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ సాధించడం అనే రేర్ ఫీట్ వెనుక రాజమౌళి చేసిన కృషి చాలా ఉంది. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటడంలో కొత్త జెనరేషన్ లో మగధీర పునాది వేయగా బాహుబలి దాన్ని ఎవరు అందుకోలేని స్థాయికి చేర్చింది. అందుకే ఎన్నేళ్ళైనా మగధీరతో మెగా ఫ్యాన్స్ కున్న ఎమోషనల్ కనెక్షనే వేరు
Please Read Disclaimer