చరణ్ వద్దనుకున్న అల్లువారి రామాయణం!

0

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండేళ్ళ క్రితం ‘రామాయణం’ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నామని.. రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని అప్పట్లో ఆయన జాతీయ మీడియాతో వెల్లడించారు. కానీ అప్పటినుంచి మరో అప్డేట్ రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది.

అల్లు అరవింద్ రీసెంట్ గా ఈ ప్రాజె క్ట్ గురించి వెల్లడిస్తూ ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తామని బడ్జెట్ ను రూ. 1500 కోట్లకు పెంచడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. మొదట్లో ఈ సినిమాలో రాముడి పాత్రకు రామ్ చరణ్ ను తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారట. కానీ చరణ్ ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఒక రాముడి పాత్ర కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయట.

రామాయణం లాంటి భారీ కేన్వాస్ ఉన్న సినిమాలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. మూడు భాగాలకు 1500 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఒక భాగానికే 500 కోట్లు. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించే హీరో ఎవరో చూడాలి.
Please Read Disclaimer