చరణ్ ఫ్యాన్స్ వర్రీ అవ్వాల్సిన పని లేదట!

0

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న క్రేజీ సినిమాలల్లో ఒకటి. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈమధ్య ‘ఛత్రపతి’ శేఖర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపిస్తారని.. ఆ పాత్రల్లో ఎన్టీఆర్ లీనమై నటిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో నటిస్తున్నానని ఆయన వెల్లడించారు.

అయితే ‘ఛత్రపతి’ శేఖర్ చెప్పిన విషయం మరో రకంగా ప్రచారమైంది. ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ గా ఉందని.. రామ్ చరణ్ పాత్రను డామినేట్ చేస్తుంది అన్నట్టుగా కొందరు కొత్త కథలు అల్లారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ కొందరు నిజమని నమ్మారట. అయితే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎక్కువ.. చరణ్ క్యారెక్టర్ తక్కువ అనేది లేదని.. ఇద్దరివి ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రలని రాజమౌళి క్యాంపుకు సన్నిహితంగా ఉండేవారు చెప్తున్నారు. ఇలాంటివి పుకార్లు నమ్మవద్దని వారు కోరుతున్నారు.

ఈ సినిమా లో ఇద్దరి పాత్రలు చాలా బలమైనవి. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరూ భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు కాబట్టి వారి పాత్రల విషయం లో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్.. చరణ్ ఇద్దరూ నిజ జీవితం లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువ తక్కువ అనే పోటీ ఉండదు.. మరి ఫ్యాన్స్ మధ్య ఇలాంటివి సృష్టించడం ఎందుకో మరి.
Please Read Disclaimer