చరణ్ అతిధిగా ప్రభాస్ `వి-ఎపిక్` లాంచ్

0

సరైన టైమింగ్ అంటే ఏమిటో డార్లింగ్ ప్రభాస్ ని చూసి నేర్వాలి. ఓ వైపు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో`ని రిలీజ్ చేస్తున్నాడు. సేమ్ టైమ్ సొంత మల్టీప్లెక్స్ చెయిన్ `వి-ఎపిక్`ని లాంచ్ చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుంటున్నాడు. `సాహో` రిలీజ్ ని `వి-ఎపిక్` ప్రచారానికి కలిసొచ్చేలా.. జాతీయ స్థాయిలో డిబేట్ రన్ అయ్యేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ డిజైన్ చేశారు. ఆగస్టు 30 న `సాహో` చిత్రాన్ని నెల్లూరు సూళ్లూరుపేటలోని సొంత మల్టీప్లెక్స్ థియేటర్ `వి-ఎపిక్`లో రిలీజ్ చేస్తున్నారు.

ఆసక్తికరంగా ఈ థియేటర్ ని సాహో రిలీజ్ కి ఒక రోజు ముందు ఆగస్టు 29న ప్రభాస్ స్నేహితుడు రామ్ చరణ్ ముఖ్య అతిధిగా లాంచ్ చేస్తున్నారు. ఆ మరుసటి రోజు నుంచి `సాహో` చిత్రం ఈ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆడనుంది. ఇండియాలోనే అతి పెద్ద స్క్రీన్ `వి-ఎపిక్`లో సిద్ధం చేయడం మరో హైలైట్. 100 అడుగుల ఎత్తు.. 54 అడుగుల వెడల్పు తో దేశంలోనే అతి పెద్ద స్క్రీన్ ఇదేనని చెబుతున్నారు. 656 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న అతిభారీ థియేటర్ ఇది. 4కె రిజల్యూషన్.. సీటింగ్ సబ్ ఊఫర్ సిస్టమ్ తో సౌండింగ్ అదిరిపోతుందట. ఇక దీంతో పాటు మరో రెండు స్క్రీన్లు మాత్రం 140 సిట్టింగ్ కెపాసిటీ ఉన్నవి ఉన్నాయి. ఇందులోనే అన్నిరకాల షాపింగ్ – గేమింగ్ ఇతర మల్టీప్లెక్సుల తరహాలోనే అందుబాటులో ఉంటాయి.

ఓ సర్వే ప్రకారం.. వినోదరంగం విస్త్రతి అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ – థియేటర్ రంగంలోకి స్టార్ హీరోలు ప్రవేశించడంతో మరింత గ్లామర్ యాడైంది. ఇప్పటికే ఏషియన్ సినిమాస్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త గేమ్ కి తెర తీశారు. ఇప్పుడు ప్రభాస్ ఈ రేసులోనే ఉన్నారు. పలువురు ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే ఎగ్జిబిషన్ – థియేటర్ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer