బాలీవుడ్ రీఎంట్రీ పై చరణ్ ఆసక్తికర వ్యాఖ్య!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `జంజీర్` రీమేక్ తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ తొలి ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ మాటే ఎత్తలేదు. ఎందుకని అలా దూరమయ్యారు? తొలి సినిమా వైఫల్యం బాధ పెట్టి ఇటు రాలేదా? అన్న ముంబై మీడియా ప్రశ్నకు చరణ్ నేడు `సైరా` ఈవెంట్ లో ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

తొలి ఫ్లాప్ వల్ల సిగ్గు పడి దూరం కాలేదు. బాలీవుడ్ కి నేను అసలు దూరం కాలేదు. సరైన కథ దొరక్కపోవడం వల్లనే హిందీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను. సరైన కథ- ప్రాజెక్టు కుదిరితే నటించేవాడిని అని అన్నారు. మరోవైపు టాలీవుడ్ లో బిజీగా ఉండడం వల్లనే హిందీ పరిశ్రమపై దృష్టి సారించలేకపోయానని తెలిపారు. అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఈసారి మిస్ ఫైర్ కాదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

“రాజమౌళి దర్శకత్వంలోని RRR సినిమాతో బాలీవుడ్ లో తిరిగి అడుగు పెడుతున్నా. ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులకు చేరువ అవుతాను. షూటింగ్ దశలో ఉన్నాం“ అని రామ్చరణ్ చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ 2020 జూలై 30న తెలుగు-తమిళం-హిందీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. జంజీర్ ఫెయిలైనా ఆర్.ఆర్.ఆర్ పై మాత్రం చరణ్ చాలానే ఆశలు పెట్టుకున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని సాహో- సైరా తరహాలోనే దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer