మెగా క్లిక్: రామరాజుతో వాల్మీకి

0

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పడిపోయాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బయట కనిపించడం అరుదైపోయింది. లుక్ విషయంలో కొంత క్లారిటీ వచ్చినప్పటికీ ప్రెస్ మీట్ లో రివీల్ చేసిన మీసకట్టుతోనే ఉంటాడా లేక ఇంకేదైనా మార్పు ఉంటుందా అనే అభిమానుల సస్పెన్స్ మాత్రం ఇంకా తొలగలేదు. దానికోసమే అన్నట్టు మెగా బ్రదర్స్ ఇద్దరూ ఈ సెల్ఫీ ఇచ్చారు కాబోలు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకిలో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ కోసం ఒళ్ళు హూనం చేసుకుంటున్న రామ్ చరణ్ ఓ రెస్టారెంట్ లో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నయ్యతో తీసుకున్స ఈ స్పెషల్ పిక్ ని వరుణ్ తేజ్ స్వయంగా తన అకౌంట్ లో పోస్ట్ చేయడం విశేషం

ఇంకేముంది మెగాభిమానుల కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ మధ్య ఇద్దరు బయట కలుసుకుంది చాలా తక్కువ. ప్రైవేట్ గా ఇంట్లో మీటయ్యే సందర్భాలు ఉన్నప్పటికీ ఇలా పబ్లిక్ గా పిక్స్ షేర్ చేసుకోవడం అరుదు. ఒకపక్క నాన్నలు చిరంజీవి సైరాలో తలమునకలై ఉండగా నాగబాబు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇంకో నెల రోజుల దాకా ఎవరికి దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు ప్లస్ సినిమా షూటింగ్ లతో మెగా ఫామిలీ మొత్తం బిజీగా టైంలో ఇలా మెగా బ్రదర్స్ ఇద్దరికీ రిలీఫ్ లాగా ఇలా కలిసి డైనింగ్ షేర్ చేసుకునే సందర్భం రావడం విశేషం కాక మరేమిటి.
Please Read Disclaimer