సండే అననురా! మండే అననురా!!

0

వర్కవుట్ చేసేవాళ్లకు సండే హాలీడే. వారమంతా జిమ్ములో కసరత్తులతో అలసిసొలసిన బాడీకి ఆదివారం విరామం తప్పని సరి. ఒక్క రోజు గ్యాప్ ఇస్తే! మళ్లీ సోమవారానికి బాడీ పికప్ అవుతుందన్నది ట్రైనర్లు చెప్పే మాట. అందుకే ఎంతటి బాడీ బిల్డర్లు అయినా ఆదివారం విశ్రాంతి ఇస్తారు. కానీ ఆర్.ఆర్.ఆర్ స్టార్లకు సండే లేదు..మండే లేదు. `సండే అననురా! మండే అననురా?` అంటూ టైమ్ దొరకడమే ఆలస్యం వర్కవుట్లతో బాడీని మెలి తిప్పేస్తున్నాడు చెర్రీ.

ఈ ఆదివారం గంటల కొద్దీ సమయం చెర్రీ పర్సనల్ ట్రైనర్ రాకేష్ ఉడియార్ సమక్షంలో జిమ్ లో వర్కవుట్లకే సమయం కేటాయించినట్లు తాజాగా లీకైన ఫోటోలను బట్టి తెలుస్తోంది. సండే కూడా స్వేదం చిందించి కసరత్తులు చేస్తూ.. తన డెడికేషన్ ని మరోసారి చాటి చెప్పాడు. ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన మేకోవర్ కోసం సినిమా ప్రారంభం నుంచి శ్రమిస్తున్నాడు. అవసరాన్ని బట్టి బరువు తగ్గడం…పెరగడం చేస్తున్నాడు. అందుకోసమే ఈ ఆదివారం కూడా ఇలా జిమ్ కే సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే విశాఖపట్టణం సమీపంలోని అరకు ఫారెస్ట్ లో ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఆ భారీ షెడ్యూల్ ముగించుకుని వికారాబాద్ అడవుల్లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు. తారక్-చెర్రీ..ఇతర ముఖ్య తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తారక్ కూడా పాత్ర అవసరాన్ని బట్టి శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. మరో విప్లవ వీరుడు కొమరం భీమ్ పాత్ర కోసం తారక్ ఇప్పటికే సిక్స్ ప్యాక్ తో షూట్ లో పాల్గొంటున్నాడు. తారక్ బాల్డ్ హెడ్ లేదా పొడవాటి గిరజాలు పిలకముడితో కనిపిస్తాడన్న ప్రచారం కూడా ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-