చెర్రీ దృష్టిలో జూ.పవర్ స్టార్

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రేణు దేశాయ్ జంట వారసుల భవితవ్యం ఏమిటి? అన్నా చెల్లెళ్లు అఖీరా నందన్- ఆద్య ఇద్దరిలో సినీ బ్లడ్ ప్రవహిస్తోంది. ఆ క్రమంలోనే ఆ ఇద్దరూ టాలీవుడ్ లోనే కెరీర్ ని ఎంచుకుంటారన్న అంచనాలు వెలువడ్డాయి. అంతేకాదు ఆ ఇద్దరి కెరీర్ కి కొణిదెల కంపెనీ వారసుడు రామ్ చరణ్ పెద్ద బూస్ట్ అన్న ప్రచారం తామరతంపరగా సాగుతోంది. ఇప్పటికే టీనేజ్ లో అడుగుపెట్టిన అఖీరా నందన్ హీరోగా ఆరంగేట్రం చేస్తాడు. బేబి ఆద్య దర్శకురాలు అవుతుంది. మామ్ డాడ్ తరహాలోనే వీరి ఆలోచనలు సాగుతున్నాయి.

అయితే ఆ ఇద్దరి లాంచింగ్ గురించి అభిమానుల్లో సాగుతున్న డిస్కషన్ పై చరణ్ వద్దనే సందేహం వ్యక్తం చేస్తే అట్నుంచి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చెర్రీ లేనప్పుడు అతడి పర్సనల్ రూమ్ లోకి వెళ్లే ఆద్య అక్కడ బ్లాక్ బోర్డ్ పై `చరణ్ అన్నయ్యను డైరెక్ట్ చేస్తాను` అని రాసిందట. తన కోరిక తెలుసుకుని చరణ్ ముసిముసిగా నవ్వేసుకున్నాడట. అలాంటి అవకాశం ఉంటే తప్పుకుండా ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. అలాగే అఖీరా నందన్ ని కొణిదెల ప్రొడక్షన్స్ ద్వారా పరిచయం చేసే అవకాశం బాబాయ్ తనకి ఇస్తే అంతకంటే భాగ్యం ఇంకేం ఉంటుంది! అని తన ఆసక్తిని కనబరిచాడు. అయితే అఖీరా నందన్ గురించి పవన్ తో ఎలాంటి చర్చా సాగలేదని స్పష్ఠతను ఇచ్చారు.

మొత్తానికి పవన్ వారసుల బరువు బాధ్యతలు చరణ్ పైనే అని దీనిని బట్టి అర్థమవుతోంది. అఖీరా.. ఆద్య బంగారు భవిష్యత్ కోసం అతడు చేయాల్సిందంతా చేస్తాడు. అందులో సందేహం లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయాక ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసే వాళ్లు ఎవరూ కనిపించలేదు. ఆ బ్లాంక్ ని ఫిల్ చేయాలంటే అఖీరా పూర్తి స్థాయి సన్నాహాకాలతో రావాల్సి ఉంటుంది. పవర్ స్టార్ రేంజులో రియల్ స్టంట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే బరిలో దిగుతాడా? అన్నది చూడాలి. అయితే అలా చేయాలంటే రేణుదేశాయ్ చాలానే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ ఆ స్థాయిలోనే అఖీరా రావాలని కోరుకుంటారనడంలో సందేహం లేదు.
Please Read Disclaimer