బాబాయ్ కి అండగా చెర్రీ వస్తున్నాడుబాబాయ్ కి అండగా చెర్రీ వస్తున్నాడు

0

ఎవరికి వారే అన్నట్లుగా మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు ఉంటున్నారని.. జనసేనకు దూరంగా వ్యవహరిస్తున్నట్లుగా మాటలు వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకూ విదేశాల్లో షూటింగ్ పేరుతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న వరుణ్ తేజ్..తాజాగా తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయటం తెలిసిందే.

తన తండ్రి నాగబాబు నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇప్పటికే ఆయన కుమార్తె.. సినీ నటి నిహారిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చెల్లెలు ప్రచారానికి వస్తే.. అన్న మాత్రం విదేశాల్లో ఉంటాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ ఎన్నికల ప్రచార గోదాలోకి దిగేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పవన్ కల్యాణ్ ను రాంచరణ్ కలవనున్నారు. విజయవాడలోని పవన్ నివాసంలో భేటీ కానున్న చెర్రీ.. తన పూర్తి మద్దతును బాబాయ్ పవన్ కల్యాణ్ కు ప్రకటించనున్నారు. ఈ పరిణామం జనసేనకు మరింత శక్తిని ఇవ్వటం ఖాయమని చెబుతున్నారు.

అంతేకాదు.. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేన తరఫున ప్రచారాన్ని నిర్వహించటానికి చెర్రీ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో మూడు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి గడువు ఉన్న నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో చెర్రీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆదివారం నుంచి కానీ లేదంటే సోమవారం నుంచి ఎన్నికల ప్రచారంలోకి రాంచరణ్ పూర్తిస్థాయిలో దిగనున్నట్లుగా సమాచారం.
Please Read Disclaimer