జనవరి లోపు కొత్తవి సైన్ చేయనున్న చరణ్

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RRR’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో చరణ్ నటించిన సినిమా ‘వినయ విధేయ రామ’ ఒక్కటే రిలీజ్ అయింది. అది కూడా ఫ్లాపుగా నిలిచింది. ట్రోలింగ్ కూడా భారీగా సాగడంతో చరణ్ క్షమాపణ చెప్తూ ఫ్యూచర్ లో మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ‘RRR’ కు సైన్ చేసిన తర్వాత చరణ్ కొత్త ప్రాజెక్టుల సంగతి పూర్తిగా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్టులను ఫిక్స్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారట. ‘RRR’ షూటింగ్ మార్చి ఆఖరుకల్లా పూర్తవుతుందని.. దీంతో అప్పటిలోపు కొత్త ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసుకోవాలనే అలోచనలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం కథలు వింటూ ఉన్న చరణ్ జనవరి ఆఖరు లోపు తన నెక్స్ట్ సినిమాపై నిర్ణయం తీసుకుంటారట. ‘RRR’ తర్వాత చేయబోయే సినిమా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉండే సినిమాను ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే నిర్మాతగా చరణ్ మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఒక అతిథి పాత్ర చేసే అవకాశం ఉందట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ చరణ్ నటించడం నిజమైతే వచ్చే ఏడాది చరణ్ నటించే రెండు సినిమాలు విడుదల అవుతున్నట్టే లెక్క.
Please Read Disclaimer