సరిలేరు విజయం చెర్రీని డిసైడ్ చేస్తుంది!

0

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ఎనభై శాతం పూర్తయింది. ఇక చరణ్ పార్ట్ మార్చి నాటికి పూర్తి కానుంది. అటుపై డబ్బింగ్.. ప్యాచ్ వర్క్ లకు మరికొంత సమయం వెచ్చించనున్నాడు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ చిత్రాన్ని చరణ్ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ కి కావాల్సిన సరంజమా అంతా ఏర్పాటు చేసి ఫ్రీ అవ్వనున్నాడు. అలాగే అందులో ఓ చిన్న కామియో పాత్రలో కూడా కనిపించనున్నాడని ప్రచారం సాగుతోంది.

అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఏమిటి అన్నది ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆర్.ఆర్.ఆర్ విజయంపై ధీమాగా ఉన్నా! అంతకు ముందున్న పరాజయం `వినయ విధేయ రామ` చరణ్ ని ఇంకా వెంటాడుతూనే ఉంది. సోలోగా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పలువురు దర్శకులు చరణ్ కి స్క్రిప్ట్ లు వినిపించి రెడీగా ఉన్నారు. ఇందులో ఎఫ్-2 దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. చరణ్ మాస్ ఇమేజ్ కు తగ్గ కమర్శియల్ స్టోరీ అనీల్ రావిపూడి వినిపించాడని ఇప్పటికే గట్టిగా ప్రచారం సాగుతోంది.

అయితే చరణ్ నుంచి ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చరణ్ కూడా అప్పుడప్పుడు మహేష్ లా సడెన్ గా నిర్ణయాలు తీసుకుంటాడు. సాఫ్ట్ కథల్లో నటిస్తూనే మాస్ ఎంటర్ టైనర్లుకు ప్రాధాన్యతను ఇవ్వడం తన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో అనీల్ కు ఒకే చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే డిసైడ్ చేసేది సరిలేరు నీకెవ్వరు సక్సెస్ అని బలంగా ప్రచారమవుతోంది. సరిలేరు పై ఇప్పటికే మహేష్ సహా అనీల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. క్రాతికి బ్లాక్ బస్టర్ కొడుతున్నామంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.

ఈ హుషారులోనే చెర్రీ ఓకే చెప్పినా చెప్పొచ్చు అన్న ఉత్కంఠ నెలకొంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సక్సెస్ అందుకుంటే అనీల్ కి మెగా కాపౌండ్ లో చరణ్ బెర్త్ కన్ఫమ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంటర్ టైన్ మెంట్ స్క్రిప్టులకు చరణ్ పెద్ద పీట వేడయంలో ముందుంటాడు. ఈ కథనాలన్నింటిపైనా సరిలేరు రిలీజ్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer