మెగా కోడలి అసహనం మోదీ చెవిన వేశారా?

0

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు బాలీవుడ్ ముఖ్యులతో వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో తమకు ఆహ్వానం అందక పోవడం పై దక్షిణాది స్టార్లు చాలా ఫీలయ్యారు. అయినా ఎవరూ.. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దూషించలేదు కానీ.. చిన్న బుచ్చుకున్న వైఖరిని సోషల్ మీడియాల్లో బయటపెట్టారు. ఎంతో కీలకమైన భేటీకి తమను ఆహ్వానించలేదేమిటో అని ప్రశ్నలు కురిపించారు కొందరు. బాలీవుడ్ వరకేనా.. టాలీవుడ్ -కోలీవుడ్ సౌత్ ఇండస్ట్రీలు మోదీజీకి కనిపించలేదా? అంటూ .. కొందరైతే సూటిగానే ప్రశ్నించారు.

అప్పట్లోనే మెగా కోడలు ఉపాసన బహిరంగంగానే ఆవేదనను వ్యక్తం చేశారు. టాలీవుడ్ నటులను మోదీ చిన్న చూపు చూసారని.. ప్రధాని పిలుపునకు వీరు అర్హులు కారా? అని అసహనం వ్యక్తం చేసారు. ఆ వ్యాఖ్యలకు ఉపాసన భర్త రామ్ చరణ్ కూడా మద్దతునిచ్చారు. ఉపాసన మాటల్లో న్యాయం ఉంది. ఈ వివక్ష దేనికి మోదీజీ? అంటూ చరణ్ కూడా ఆవేదన చెందారు.

తాజాగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుటుంబసమేతంగా దిల్లీ వెళ్లి మోదీని కలిసిన సంగతి తెలిసిందే. దీంతో మోహన్ బాబు బీజేపీలో చేరుతున్నారని వార్తలు వెడెక్కించాయి. కానీ ఆయన మాత్రం వ్యక్తిగతంగానే కలిసాను తప్ప.. పార్టీ విషయాలేవి మాట్లాడ లేదని ట్విస్ట్ ఇచ్చారు. బిజేపీలో చేరతానా? లేదా? అన్నది అతి త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.

ఇక మంచు విష్ణు సైతం మోదీతో కరచాలనం చేశాక ఆయన చెవిలో ఏదో గుసగుసగా చెప్పారట. అదేమిటి? అంటే.. ఇటీవలే బాలీవుడ్ తారలను గ్రీట్ చేశారు.. కానీ సౌత్ లో ఎవరినీ పిలవకపోవడంతో కొందరు ఫీలయ్యారని చెప్పారట. దక్షిణాది నటులు అందునా టాలీవుడ్ దిగ్గజనటులు ఫీలైనట్లు మోదీ చెవిన వేసినట్లు తనే స్వయంగా తెలిపాడు. దానికి బదులిచ్చిన ప్రధాని.. అతి త్వరలోనే దక్షిణాది తారలను తప్పనిసరిగా కలుస్తానని మాటిచ్చినట్లు విష్ణు తెలిపాడు. ఆ రకంగా మెగా కోడలి ఆవేదన మోదీ చెవిన పడిందన్న మాట. ఇక విష్ణు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎంతో సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer