మెగా ఫ్యామిలీపై సినిమా.. వర్మ ఏమన్నారు?

0

ఆర్జీవీ `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ సినిమా టైటిల్ ను `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు`గా మార్చారని ప్రచారం అవుతోంది. ఇక సెన్సార్ చిక్కుల వల్ల ఈ శుక్రవారం రిలీజవ్వాల్సిన సినిమా డైలమాలో పడింది. ఇకపోతే ఈ చిత్రానికి టీవీ చానెళ్ల లైవ్ సాక్షిగా ఆర్జీవీ ప్రచారం ఊదరగొట్టేయడమే గాకుండా ఇంటర్వ్యూల్లో రకరకాల ఆసక్తికర విషయాల్ని రివీల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య-జూ.ఎన్టీఆర్ పాత్రలు ఉంటాయా? అంటే ఉండవని ఇంతకుముందు క్లారిటీనిచ్చారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఉంటుందా? అన్న ప్రశ్నకు.. అందుకు అవకాశం లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర ఉందని అన్నారు. అయితే పవన్ పాత్రనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే.. పవన్ అంటే విపరీతమైన ఇష్టమని.. ఆయన వేదికలపై మాట్లాడే తీరు బావుంటుందని ఆర్జీవీ అన్నారు. అయితే ఎంతో బాగా మాట్లాడే పవన్ అప్పుడప్పుడు దారి తప్పుతుంటారని కూడా ఆర్జీవీ అన్నారు. ఇక చిరంజీవి ఎంతో సాఫ్ట్. అందుకే ఆయనను తెరపై చూపించలేమని అన్నారు. పవన్ పాత్ర మాత్రమే ఉండడానికి చిరు రోల్ లేకపోవడానికి కారణాల్ని ఆయన శైలిలో ఇలా చెప్పుకొచ్చారు. ఇక పవన్ ని ట్రోల్ చేయడానికి అవకాశం ఉంది కానీ.. చిరుని ట్రోల్ చేయడానికి అవకాశమే లేదని క్లీన్ చిట్ ఇచ్చేశారు.

మెగా ఫ్యామిలీపై సినిమా అన్నారు కదా? చేస్తున్నారా లేదా? అని ప్రశ్నిస్తే.. మెగా ఫ్యామిలీలో 39 మంది చిల్డ్రన్ ఉన్నారు.. పిల్లల సినిమా తీయలేనని అప్పుడే చెప్పాను కదా! అని అన్నారు. మొత్తానికి ఆర్జీవీ ఆ రెండు విషయాలపైనా పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
Please Read Disclaimer