ఆర్జీవీ థైస్ పార్టీ పిచ్చి పీక్స్ గురూ

0

లైవ్ లో ఓడ్కా కొట్టడం.. మందేసి చిందేసి రచ్చ చేయడం.. వేదికలు ఎక్కి అమ్మాయిల భుజాలు కుదిపేస్తూ స్టెప్పులేయడం.. ఇవన్నీ చూస్తుంటే అసలు ఆర్జీవీకి ఏమైంది? ఉన్నట్టుండి ఆయనకు ఏమిటీ మాయ రోగం? అన్న చర్చ వేడెక్కిస్తోంది. ఆర్జీవీ పిచ్చి పీక్స్ కి చేరుకుంది. ఆయన పబ్లిసిటీ రచ్చ మరో లెవల్ కి చేరుకుంది.

పార్టీ మామూలుగా ఉంటే ఓకే కానీ.. ఇలా గన్స్ అండ్ థైస్ తరహా పార్టీలు అయితే డేంజరే. ఆర్జీవీ వోడ్కా తాగితే మరీ ఈ వీరంగం ఏమిటో కానీ పిచ్చి పరాకాష్టకు చేరుకుందనే అర్థమవుతోంది. ఆయనకు అమ్మాయిలు అన్నా థైస్ అన్నా ఎంత ఇష్టమో తాజాగా సోషల్ మీడియాలో రివీల్ చేసిన ఫోటోల్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా బ్యూటిఫుల్ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ తో ఇదిగో ఇలా థై పార్టీలో తైతక్కలాడారు ఆర్జీవీ. సదరు కాస్ట్యూమర్ ని ఇలా ఒడిలో కూచోబెట్టుకుని నానా రచ్చ చేశారు.

వయసు అరవై కి చేరువవుతున్నా ఆర్జీవీలోని టీనేజీ భూతం బయటికి పోలేదు. ఇప్పటికీ అదే పిచ్చి ఆయనను పట్టి కుదిపేస్తోంది. అయితే ఈ పిచ్చి వెనక పబ్లిసిటీ అనే రాకాసి నిరంతరం నిదుర లేచి ఉంటుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అన్నట్టు ఇంత రచ్చ చేసినా అసలు బ్యూటిఫుల్ వచ్చిందో రాలేదో కూడా ఎవరికీ తెలీలేదు..ప్చ్!! వచ్చిందని తెలిసినా చెత్త సినిమా అని తేల్చేశారు కొందరైతే!!
Please Read Disclaimer