బాక్స్ ఆఫీస్ పై ఆర్జీవి బ్యూటిఫుల్ బాంబు!

0

రామ్ గోపాల్ వర్మ సినిమాలపై ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి ఉంటుంది. టైటిల్ ప్రకటన వచ్చిన సమయం నుంచి రిలీజ్ రోజు వరకూ ఆసక్తి ఉంటుంది. అయితే వర్మ సినిమాపై ఆసక్తి చూపించిన వారంతా నిజంగా టికెట్లు కొనుక్కుని సినిమా చూస్తారా అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే సినిమాలతో బాక్స్ ఆఫీస్ పై దాడి చేస్తూ తనకోసం వచ్చే పిచ్చి అభిమానుల మనసులను తీవ్రంగా గాయపరుస్తున్నాడు వర్మ.

ఈ రోజు వర్మ క్యాంప్ నుంచి ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాకు వర్మ దర్శకుడు కాకపోయినా వర్మ సినిమాలాగా ప్రచారం జరిగింది. స్వయంగా ఇదో అద్భుతం అన్నట్టు వర్మ కూడా తనదైన శైలిలో ప్రచారం చేశాడు. ‘బ్యూటిఫుల్’ హీరోయిన్ నైనా గంగూలీ తో కలిసి క్రేజీ స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. అయితే ఈ రోజు సినిమా చూసిన వారికి దాదాపు నోటమాట పడిపోయిందని అంటున్నారు. స్కిన్ షోను నమ్ముకుని రెండున్నర గంటల సినిమా తీస్తే ఇలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకంటే యూట్యూబ్ లో ఉన్న చాలా షార్ట్ ఫిలిమ్స్ ఎంతో మెరుగ్గా ఉంటాయని విమర్శిస్తున్నారు.

కొసమెరుపు ఏంటంటే ఈ సినిమా రివ్యూ కోసం వెళ్ళిన కొందరు రివ్యూయర్లకు కూడా తలబొప్పి కట్టిందని అంటున్నారు. ప్రొఫెషనల్ ఎథిక్స్ కోసం జస్ట్ సినిమా బాగాలేదని మాత్రం రాసి ఊరుకోవాల్సి వస్తోందని అంటున్నారు. నిజాయితీగా రివ్యూయర్ల మనసులో ఉన్న ఫీలింగ్స్ ను రివ్యూ రూపంలోకి మారిస్తే బండబూతులతో ‘అర్జున్ రెడ్డి’ విజయదేవరకొండ స్టైల్ లో రివ్యూ రాయాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి బాక్స్ ఆఫీస్ నేరాలు ఘోరాలకు అలాంటి బూతుల రివ్యూనే కరెక్ట్ అని అంటున్నారు.
Please Read Disclaimer