వర్మ క్రియేటివిటీ చూడండి గురూ

0

దర్శకుడిగా రెండు దశాబ్దాల కిందట రామ్ గోపాల్ వర్మ ఏంటో.. ఇప్పుడు ఆయన ఏంటో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు దేశవ్యాప్తంగా యువతను సినిమాల వైపు నడిపించి.. వందల మంది సినీ రంగంలో కుదురుకునేలా చేసిన ఘనుడాయన. ఆయన ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంలా కనిపించేది. కెరీర్ తొలి పదేళ్లలో వర్మ తీసిన ఫ్లాప్ సినిమాలు కూడా క్లాసిక్సే. కానీ రెండో దశాబ్దంలో ఆయన ప్రభ తగ్గుతూ వచ్చింది. మూడో దశాబ్దం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ‘ఐస్ క్రీమ్’ అనే నాసి రకం సినిమాతో మొదలైన ఆయన పతనం.. ఎప్పుడో పాతాళాన్ని తాకేసింది. ‘అమ్మ రాజ్యంలో కమ్మ బిడ్డలు’ సినిమా సమయానికి పాతాళం ఆయనకు కనిపించనంత ఎత్తులో ఉందని అర్థమైపోయింది. ఐతే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు తీసుకుంటూ పోవడం వర్మకే చెల్లింది.

ఇప్పుడు లాక్ డౌన్ కదా వర్మ సైలెంటుగా ఉంటాడులే అనుకుంటే.. చడీచప్పుడు లేకుండా ‘క్లైమాక్స్’ అనే కొత్త సినిమాను ప్రకటించాడు. ఇది తీయబోయే సినిమా కాదు. తీసేసిన సినిమా. అదే ట్విస్టు. ఇంతకు ముందు ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అనే వివాదాస్పద పోర్న్ మూవీ తీసిన మియా మాల్కోవా తోనే ఈ సినిమా తీశాడు. ఇది ఫీచర్ ఫిలిమా.. షార్ట్ ఫిలిమా అన్నది స్పష్టత లేదు. మూడు రోజుల కిందటే టీజర్ లాంచ్ చేశాడు. ఇప్పుడు ట్రైలర్ అంటూ వచ్చాడు. ఏకాంతం కోసం ఎడారి ప్రాంతానికి వెళ్లి శృంగార కార్యకలాపాల్లో మునిగి పోయిన ఓ జంట ఎదుర్కొన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ట్రైలర్లో మియా ఒంపుసొంపులు మినహాయిస్తే ఆకర్షించే విషయమే లేదు. మంచి సౌష్టవం ఉన్న హీరోయిన్ దొరికితే.. రకరకాల యాంగిల్స్ లో తన అందాలు ఎలివేట్ చేయడం వర్మకు అలవాటు. మియా లాంటి పోర్న్ స్టార్ దొరికేసరికి ఇంకా రెచ్చిపోయినట్లున్నాడు. ట్రైలర్ చివరి షాట్లో మియా నగ్నంగా ఎడారిలో పడుకుని నడుం భాగాన్ని పైకి లేపితే ఆ గ్యాప్లో సూర్యుడు కనిపించే షాట్ చూస్తే అబ్బబ్బబ్బా.. ఏం క్రియేటివిటీ అనిపిస్తోంది. కానీ వర్మ క్రియేటివిటీ ఇలాంటి రసాత్మక దృశ్యాలకే పరిమితం అయి.. కథా కథనాలు మేకింగ్ లో అడుగంటి పోవడమే విషాదం.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home