ఆయన్ని కూడా వదలనంటున్న వర్మ!

0

ఇంతకీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పోలింగ్ కంటే ముందు విడుదలవుతుందా లేదా అనేదాని గురించి ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేదు. ఒకపక్క పోస్టర్లతో పబ్లిసిటీ ఊదరగొడుతున్నారు. మరోపక్క ఏ టీవీ ఛానల్ పిలిచినా వర్మ నో చెప్పకుండా వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి ఏదో ఒకటి మాట్లాడుతూ తన సినిమా ప్రచారం పక్కకు వెళ్ళకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఇందులో భాగంగా ఓ మీడియా సంస్థ చేసిన ముఖాముఖీలో మాట్లాడిన వర్మ కెసిఆర్ బయోపిక్ ప్రస్తావన తీసుకురావడం విశేషం.

ఆయన జీవితంలో చాలా డ్రామా ఉందని ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం ముక్కుసూటిగా పోరాడే తత్వం ఇవన్ని కలగలిపితే ఓ దర్శకుడికి అంత కన్నా బయోపిక్ మెటీరియల్ ఏం కావాలని చెప్పాడు. నిజానికి వర్మ కన్నా ముందు ఈ ఆలోచన వచ్చిన ఒకరిద్దరు ఇప్పటికీ సినిమాలు తీసేశారు. ఉద్యమ సింహం విడుదలకు సిద్ధంగా ఉంది. మరొకటి షూటింగ్ స్టేజి లో జరుగుతోంది.

సో వర్మ చెప్పినవే అందులోనూ ఉంటాయి కాబట్టి ఇక్కడ తేడా చూపించేది వర్మ అనే బ్రాండ్ మాత్రమే. అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సంగతి పూర్తిగా తేలకుండా వర్మ ఇలా కెసిఆర్ ప్రస్తావన తీసుకురావడం విశేషమే. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కనక బ్రేకులు పడితే తెలంగాణాలోనైనా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఇప్పుడు బయోపిక్ పేరుతొ కెసిఆర్ ను అదే పనిగా పొగుడుతున్న వర్మ మైండ్ లో ఏదో ఒక స్ట్రాటజీ ఉండే ఉంటుంది.
Please Read Disclaimer