ఆర్జీవీ నిర్మాత ఖతర్నాక్ ప్లేబోయ్ వేషాలు

0

వివాదాల ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. వివాదంతో ప్రచారం ఆయన శైలి. ప్రతిసారీ ఈ సక్సెస్ ఫార్ములాని తెలివిగా ప్రయోగించి సక్సెస్ సాధిస్తున్నాడు. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి అదే పంథాని అనుసరిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ .. ట్రైలర్.. సాంగ్.. పోస్టర్ ప్రతిదీ సంచలనానికి తావిచ్చాయి.

తాజాగా మరో హీటెక్కించే మ్యాటర్ ని అభిమానులకు పరిచయం చేశాడు ఆర్జీవీ. ఈ సినిమాకి పెట్టుబడి పెడుతున్న ఓ ప్లేబోయ్ కం డాన్ గురించి చెప్పుకొచ్చాడిలా. అతడు నిరంతరం అమ్మాయిలతో ఆటలాడతాడు. గాళ్స్ తో ఫోటోషూట్లతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాడు. పేరు అజయ్ మైసూర్. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి సహనిర్మాతగా కొనసాగుతున్నాడు అని తెలిపాడు. అంతేకాదు అతడి పరిచయమే ఓ వివాదాస్పద డాన్ తో పోల్చాడు. “ఇదే ఆయనకు మొదటి సినిమా. డాన్ బిల్జరియాన్ లాంటి వ్యక్తి“ అంటూ అతడి ఫోటోని షేర్ చేశారు వర్మ.

డాన్ బిల్జరియాన్ ఫక్తు జల్సా రాయుడు. అమ్మాయిలు.. జూదం వగైరా వగైరా అతడి చుట్టూ ఉండాల్సిందే. బికినీ బీచ్ లలో చిట్టి పొట్టి దుస్తులతో గాళ్స్ తో కలిసి ఫోటోషూట్లలో పాల్గొంటాడు. లైఫ్ ని నచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటాడు. అజయ్ మైసూర్ అదే తరహా అని పరిచయం చేశాడు. వర్మ చెప్పినట్టే అజయ్ మైసూర్ ఇన్ స్టా ఆద్యంతం బికినీ బేబ్స్ తో అతడి సయ్యాటలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వర్మ నిర్మాత ఎంత ఫేమస్సో జనాలకు తెలిసొచ్చింది ఒక్క ట్వీట్ తో. ఆర్జీవీనే పెద్ద జల్సారాయుడు అని భావించే వారికి అతడి ప్రొఫైల్ ఇంకా పెద్ద షాక్ అని చెప్పాలి.
Please Read Disclaimer