‘నగ్నం ఫిల్మ్ బడ్జెట్ రెండు వేలే’ క్రిటిక్ దిమ్మతిరిగేలా వర్మ ఆన్సర్!

0

వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా కాస్త వెరైటీగానే చేస్తాడు. ఆయన మైండ్ సెట్ అలాంటిది. అప్పుడే ఓ పొలిటికల్ ఫ్యాక్షన్ థ్రిల్లర్ తీస్తాడు.. అప్పుడే పూర్తి శృంగారభరిత సినిమాలు తీస్తాడు. ఆయన ఆలోచన ధోరణి అలా ఉంటుందని అంటారు కానీ ఆయనే అలా మలుచుకున్నాడని తెలిసిందే. తాజాగా వర్మ వదిలిన రొమాంటిక్ బాణం ‘నగ్నం’. ఈ సినిమా 28న ఆర్జీవీ వరల్డ్ లో.. అంటే శ్రేయాస్ ఎట్ యాప్ లో విడుదలైంది. ట్రైలర్స్ తో ఏవో అంచనాలు పెంచిన వర్మ తీరా సినిమాలో మాత్రం ఏం లేదని తేల్చేశాడని చూసినవాళ్లంతా అంటున్నారు. నిజానికి వర్మ సినిమాలలో జనాలు కోరుకునే అంశాలు చాలానే ఉంటాయి. అయితే నగ్నం సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిందట.ఇక నగ్నం సినిమా పై ఎవరు ఎలా మాట్లాడుకున్నా.. ఓ ఫేమస్ వివాదాల క్రిటిక్ ఇచ్చిన రివ్యూ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నగ్నం చూసాక ఆ క్రిటిక్.. ‘వర్మ గారితో ఫోన్లో మాట్లాడాను ఆయనకు కోపం వచ్చింది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆయన వర్మతో ఫోన్లో ఏం మాట్లాడాడో.. ఆ మాటలు కూడా పోస్ట్ లో తెలియజేసాడు. “అర్ధరాత్రి వర్మ ఫోన్ వచ్చింది. ఏంటయ్యా నా ‘నేకేడ్’ ఫిల్మ్ బడ్జెట్ లక్ష అని రాసావ్? అని అడిగాడట. దానికి ఈయన “ఏమోనండి అంతకు మించిన ఖర్చు అందులో ఏమీ కనిపించలేదు. అందుకే లక్ష అని డిసైడ్ అయ్యాను” అని క్లియర్ గా చెప్పేసాడట. ఆ వెంటనే వర్మ నవ్వి.. “నన్ను అడిగితే నేను అసలు ఖర్చు చెప్పేవాడినిగా” అన్నాడట.

దానికి ఈయన సరే చెప్పండి. అంటే వర్మ “రెండు వేలు” అని చెప్పేశాడట. “అవును అక్షరాలా రెండు వేలు మాత్రమే.. అందులో నౌకరు పాత్ర చేసిన కుర్రాడి ట్రావెల్ ఖర్చులు తప్ప ప్రొడక్షన్ ఖర్చు ఏంలేదు. కెమెరా.. ఎడిటింగ్.. మిక్సింగ్ అన్నీ మా దగ్గరే” అని వర్మ ఇచ్చిన ఆన్సర్ కి దిమ్మతిరిగి.. ఆ క్రిటిక్ “అసలు ఏమిటీ ఈయన” అని అనుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొంతమంది సినీ క్రిటిక్స్ ఈ చిత్రంలో కథనం పెద్దగా లేకపోయినప్పటికీ హీరోయిన్ ప్రైవేట్ శరీర భాగాలు ఎక్కువగా చూపించడం.. శృంగార భరిత తరహా సన్నివేశాలు ఉండడం వల్ల వర్మ ఏదో నెట్టుకొచ్చాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer