వర్మ తాజా టార్గెట్ పీకే..అదిరేటి దెబ్బ కొట్టేశాడు!

0

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వ్యవహారం మామూలుగా లేదనే చెప్పాలి. ఇటీవలి ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ బయోపిక్ తీసిన వర్మ… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని భారీగానే టార్గెట్ చేశాడు. ఎన్నికలు ముగిశాక… వైసీపీ విజయం నేపథ్యంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట మరో చిత్రాన్ని ప్రకటించిన వర్మ… ఇప్పుడు బాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేశాడు. పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ట్విట్టర్ వేదికగా వర్మ సంధించిన ఓ పోస్ట్ పీకేకు గట్టిగానే తగిలిందని చెప్పక తప్పదు. తన చిత్రంలో పీకే పాత్ర ఉంటుందని ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన వర్మ…. ఆ పాత్రకు అచ్చం పవన్ మాదిరే ఉన్న నటుడిని ఏరికోరి మరీ తీసుకొచ్చి… పవన్ మాదిరే ఫోజు పెట్టించి ఫొటో తీసి… దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరు పెట్టిన వర్మ… ఈ సినిమాలోనూ చంద్రబాబును టార్గెట్ చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ సినిమాలో పవన్ పాత్రను కూడా పెట్టేసిన వర్మ… పీకేను కూడా టార్గెట్ చేసేసినట్టేనని తెగేసి చెప్పినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి. పవన్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసిన ఫొటోకు వర్మ మరింత ఆసక్తి రేకెత్తించేలా కామెంట్ పోస్గ్ చేశాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి తన సినిమాలోని ఏ పాత్ర పోషిస్తున్నాడో గుర్తు పట్టండి అంటూ కామెంట్ చేసిన వర్మ… పీకేకు ఆయన ఫ్యాన్స్ ను ఓ రేంజిలో వేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్… 2019 వచ్చేసరికి సొంతంగా పొడిచేస్తానంటూ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ఓటరు మాత్రం అటు టీడీపీని ఇటు పీకే పార్టీ జనసేనకు ఊహించని షాకిస్తూ… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి బంపర్ విక్టరీ కట్టబెట్టారు.

వైసీపీకి దక్కిన ఈ విజయం నేపథ్యంగానే వర్మ తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకే దానికి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే పేరు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల పాటు సైలెంట్ గానే ఉండిపోయిన వర్మ… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే నాడు టైటిల్ సాంగ్ వదిలి అందరినీ షాక్ కు గురి చేశాడు. తాజాగా పవన్ పాత్రను పరిచయం చేసే సందర్భాన్ని కూడా వర్మ చాలా వ్యూహాత్మకంగా పీకే బ్రదర్ చిరంజీవి బర్త్ డేను ఎంచుకోవడం చూస్తుంటే… మున్ముందు ఇంకెంత మేర ఆసక్తి పెంచేస్తారోనన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా తన తాజా చిత్రంలో బాబుతో పాటు పీకే కూడా తన టార్గెట్టేనని వర్మ చెప్పకనే చెప్పేసినట్టైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Please Read Disclaimer