బాలయ్యకు ముందుంది ముసళ్ల పండగ

0

`కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` ట్రైలర్ ప్రస్తుతం హాట్ టాపిక్. వివాదాల ఆర్జీవీ మరోసారి తనదైన శైలిలో చెలరేగాడు. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందో.. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పరిణామాలు ఎలా మారాయో అన్నిటినీ తెరకెక్కించేస్తున్నానని చెప్పకనే చెప్పాడు. జగన్ సీఎం అవ్వడం మొదలు అంతకుముందు విషయాల్ని.. ఆ తర్వాత విషయాల్ని కూడా అతడు తెరపై చూపించబోతున్నాడు. బర్నింగ్ టాపిక్ కి మసాలా జోడించి వర్మ చూపిస్తున్నారట.

దీపావళి కానుకగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో జగన్ పాత్రధారి.. చంద్రబాబు పాత్రధారి ఆకట్టుకున్నారు. వీళ్లతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్- మత ప్రబోధకుడు కేఏ పాల్- తేదేపా యువరాజు నారా లోకేష్ తదితరుల్ని వర్మ ఆడేసుకున్నాడు. ప్రధాన పాత్రల్ని సీరియస్ గా చూపించి.. ఇతరుల్ని కమెడియన్లుగా చూపిస్తూ సెటైరికల్ గా ఈ ట్రైలర్ ని రూపొందించాడు. సినిమా ఆద్యంతం వర్మ కామెడీలు మామూలుగా ఉండవని అర్థమైంది. అయితే ఫ్యాన్స్ గుండెల్ని రగిలించే కుంపటిని రాజేశాడని ట్రైలర్ చూసిన వారికి అర్థమైంది. అయితే వర్మ ఇంత చేసినా ఇంకేదో లోటు కనిపించింది. ఆ లోటు ఏమిటి? అని ఆరాతీస్తే.. అసలు సిసలు పాత్రధారి నందమూరి బాలకృష్ణ ఎక్కడ? అంటూ సందేహం వ్యక్తమైంది. బాలయ్య అల్లుడు లోకేష్ ని `పప్పు!` అంటూ ట్రైలర్ లోనే చంద్రబాబుతో పప్పు వడ్డింపజేసి.. పబ్లిగ్గా గాలి తీసిన వర్మ బాలయ్యను వదిలేశారేం? అంటూ ముచ్చట వేడెక్కిస్తోంది.

బావ చంద్రబాబు వెంటే ఉండి హిందూపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలయ్య రాజకీయాల గురించి ప్రజానీకానికి తెలుసు. అలాంటి ఇంపార్టెంట్ పాత్రను లైట్ తీస్కున్నాడేం? అంటూ ఆర్జీవీపై ప్రశ్నల్ని సంధించారు కొందరు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తాడట. `ముందుంది ముసళ్ల పండగ` అంటూ చెప్పుకుంటున్నారు. ఎన్బీకే పైనా మొండి వర్మ ఫుల్ ఫోకస్ పెడుతున్నాడట. అతడికంటూ ఓ చాప్టర్ కేటాయించాడని తెలుగు సినీమీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య బాబుకి ప్రత్యేకంగా ఓ టీజర్ ఉంటుంది. ఇందులో ఆయన స్టైల్ అభిభాషణంతో పాటు పంచ్ లకు కొదవే ఉండదట. “మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు“..అన్న డైలాగ్ తో పాటు.. ఇటీవల శ్రీరెడ్డి ప్రత్యేకంగా గుర్తు చేసిన ఓ స్పైసీ డైలాగ్ కూడా ఆ వీడియో టీజర్ లో ఉంటుందట. ఉందిలే స్పెషల్ ట్రీట్ .. ఎక్స్ క్లూజివ్ గా అంటూ ముచ్చట సాగుతోంది. వర్మ శైలి చూస్తుంటే చంద్రబాబు అభిమానులు.. లోకేష్ బాబు అభిమానులు.. బాలయ్యబాబు అభిమానులు అందరికీ ట్రీట్ ఇస్తున్నట్టే కనిపిస్తోంది. మరి అట్నుంచి స్పందన ఎలా ఉంటుంది? అన్నది ఇప్పటికైతే గప్ చుప్.
Please Read Disclaimer