డియర్ వైరస్ నువ్వు బతుకు మమ్మల్ని బతకనివ్వు : వర్మ

0

రామ్ గోపాల్ వర్మ ఏం ఎలాంటి విషయంపై అయినా తనదైన శైలిలో స్పందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. తాజాగా కరోనా వైరస్ పై కూడా తనదైన శైలిలో స్పందించాడు. కరోనా వైరస్ ను హెచ్చరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మమ్ముల పట్టి పీడివ్వడం వల్ల నీకు కూడా నష్టమే. మేము చనిపోవడంతో పాటు నువ్వు కూడా మాతో పాటు చనిపోతావు అనే విషయాన్ని తెలుసుకో అంటూ వింత లాజిక్ తో కరోనాను బెదిరించాడు.

వర్మ ట్విట్టర్ లో… డియర్ కరోనా వైరస్ నీవు బుద్ది లేకుండా అందరిని చంపుకుంటూ పోతున్నావు. అలా అయితే నువ్వు కూడా చనిపోతావు. నువ్వు ఒక పారసైట్ అనే విషయాన్ని మర్చి పోకు. ఈ విషయం నీకు తెలియాలి అంటే వైరాలజీ క్రాష్ కోర్సును చదువుకో. వైరాలజీ ప్రకారం నీకు చెప్పేది ఏంటీ అంటే మమ్ములను బతకనిచ్చి నువ్వు కూడా బతుకు. నీకు కనీసం జ్ఞానం ఉన్నా కూడా బాగుండేది. నీకు ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మనుషులను చంపేస్తున్నావు అంటూ వింత పోస్ట్ ను వర్మ పెట్టాడు.

అంతా కూడా కరోనా నుండి దూరంగా ఉండటం ఎలా.. కరోనా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ ఉంటే వర్మ మాత్రం కరోనాకే సలహాలు సూచనలు ఇస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే వర్మ ఈజ్ యూనిక్ అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-