దానికి జస్టిఫికేషన్ ఎలా ఇస్తావ్ ఆర్జీవీ?

0

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఈ టైటిల్ ను చాలా కాలం కిందటే ప్రకటించాడు. ఇప్పుడు ఆ సినిమాకు అప్ డేషన్స్ ఇస్తున్నాడు. ఇందతా తెలిసిన సంగతే కానీ.. ఇంతకీ ఈ సినిమా టైటిల్ కు రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా జస్టిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాడు? అనేదే అంతుబట్టని ప్రశ్న!

ఇది వరకూ వర్మ బోలెడన్ని వివాదాస్పద అంశాలపై సినిమాలు అనౌన్స్ చేశాడు. వాటిల్లో కొన్ని తీశాడు. కొన్నింటిని తీయలేదు. తీసిన సినిమాలు ఆడింది కూడా లేదు. అయినా వర్మ తన తీరును మార్చుకోవడం లేదు.

వర్మతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లకు కూడా ఏం మిగులుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక వర్మ చేపట్టిన ఈ తాజా సినిమా టైటిల్ రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టేలా ఉందని వేరే చెప్పనక్కర్లేదు. మరి ఈ చిచ్చును ఆర్జీవీ టైటిల్ వరకే పెడతాడా – మొత్తం సినిమా అంతా అలాగే ఉంటుందా? అనేది వర్మ ఈ సినిమాను తీస్తే కానీ అర్థం కాదు.

కమ్మ రాజ్యం అంటూ ఏదీ ప్రత్యేకంగా లేదు. అలాంటి చోట కడప రెడ్లు ఏం చేశారో వర్మకే తెలియాలి. బహుశా ఏ విజయవాడ- గుంటూరు ప్రాంతంలో కడప రెడ్లు ఎవరైనా వెల్లి ఆధిపత్యం చేయడం గురించి వర్మ ఈ కాన్సెప్ట్ అనుకుంటున్నాడా? లేక మరేదైనా సోషల్ కథ ఉంటుందో ఆయనకే తెలియాలి. అయితే తన మార్కు వివాదాన్ని రేపడంలో అయితే వర్మ ప్రస్తుతానికి సక్సెస్ అయినట్టే!
Please Read Disclaimer