కరోనాకు సూపర్ మ్యాన్ కు లింకు పెట్టిన వర్మ?

0

చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంటే….కరోనాను మాత్రం మన రామ్ గోపాల్ వర్మ వణికిస్తున్నాడు. ఈ వైరస్ కే గనక వర్మ గురించి తెలుసుంటే అసలు జనాలకు సోకేందుకు కూడా జంకేదేమో. అప్రమత్తంగా లేకుంటే నేను ఎటాక్ చేస్తా అని కరోనా అంటుంటే వర్మ మాత్రం కరోనా వైరస్కే డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నాడు. మనల్ని చంపితే కరోనా కూడా చస్తుందంటూ వర్మ చెప్పిన ఫిలాసఫీ దెబ్బకు కరోనా కూడా ఏ వర్మ కో కుచ్ కరోనా అంటుందేమో. ఇక తాజాగా మరోసారి కరోనాపై వర్మ చేసిన ఇంటరెస్టింగ్ ట్వీట్ సోెషల్ మీడియాలో వైరల్ అయింది. కరోనా ఆట కట్టించాల్సిన సూపర్ మ్యాన్ – బ్యాట్ మ్యాన్ – స్పైడర్ మ్యాన్ ఎక్కడకు పోయారంటూ వర్మ ట్వీట్ చేశాడు.

ప్రపంచానికి పెనుముప్పు వచ్చినపుడు సూపర్ మ్యాన్ – బ్యాట్ మ్యాన్ – స్పైడర్ మ్యాన్ ….ఇలా ఎవరో ఒక `మ్యాన్` వచ్చి కాపాడతాడన్న విషయాన్ని వర్మ గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు. కరోనా విలన్ ప్రపంచాన్ని కబళిస్తోంటే… సూపర్ మ్యాన్- బ్యాట్ మ్యాన్ – స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నారని వర్మ ప్రశ్నించాడు. కరోనాకు భయపడి వారంతా వేరే గ్రహాలకు పారిపోయారని మాత్రం చెప్పవద్దంటూ వర్మ సెటైర్ వేశాడు. బుద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూ పోతే నువ్వు కూడా చచ్చిపోతావు అంటూ కరోనాకు వర్మ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా ఒక పారాసైట్ మాత్రమేనని తన మాటపై నమ్మకం లేకపోతే వెంటనే వైరాలజీ క్రాష్ కోర్స్ తీసుకోవాలని కూడా వర్మ ఉచిత సలహా ఇచ్చాడు. కరోనాకు కూడా జ్ఞానం ఉంటే బాగుండంటూ వర్మ చేసిన ట్వీట్ కొద్ది రోజుల క్రితం వైరల్ అయింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-