బీజేపీ నాయకుడి వార్నింగ్ కు వర్మ రియాక్షన్!

0

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం నుండి ఇప్పటికే ట్రైలర్ వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుంది.. ఎవరు ఉండబోతున్నారనే విషయమై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రం టైటిల్ విషయమై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా వల్ల రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకూడదంటూ ఏపీ యువమోర్చా అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే రమేష్ సెన్సార్ బోర్డు సభ్యులకు ఈ చిత్రంపై ఫిర్యాదు చేశారు. రెండు ప్రాంతాలు.. రెండు వర్గాలు.. రెండు పార్టీల మద్య ఈ సినిమా చిచ్చు పెట్టేలా ఉందని కొందరిని కించపర్చే విధంగా ఉండటం వల్ల ఈ సినిమాను విడుదల అవ్వకుండా ఆపాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులకు రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై వర్మ పలు మీడియా సంస్థల్లో చర్చల్లో పాల్గొంటున్నాడు.

ఒక టీవీ ఛానెల్ లో వర్మ మరియు రమేష్ లు ఇద్దరు కూడా చర్చలో కూర్చున్నారు. ఈ సందర్బంగా రమేష్ తన అభ్యంతరాలను లేవనెత్తిన సమయంలో చాలా కేర్ లెస్ గా వర్మ సమాధానం చెప్పాడు. రమేష్ మాట్లాడుతున్న సమయంలో శ్రీదేవి పాటను వర్మ హమ్ చేయడం కూడా జరిగింది.

రమేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ నా సినిమా నా ఇష్టం.. నిన్ను చూడమని అడగడం లేదు.. చూడమని చెప్పను అన్నాడు. వర్మ బెదిరిస్తే బెదిరేవాడు కాదు.. వార్నింగ్ ఇస్తే భయపడేవాడు కాదు అనే విషయం తెలిసి కూడా కొందరు ఆయన్ను ఏదో చేయాలని ప్రయత్నించి ఎప్పటికప్పుడు విఫలం అవుతూనే ఉంటారు అంటూ వర్మ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
Please Read Disclaimer