సినీ రచయితపై వర్మ మార్కు సెటైర్లు..ఘాటెక్కువైనట్టే

0

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… నిజంగానే ఏది చేసినా సంచలనమే. తాను తీసే సినిమాలతో పాటుగా ఆ సినిమాలపై జరిగే రచ్చ కూడా సంచలనంగానే మారిపోతోంది. తనదైన మార్కు చూపిస్తూ… ఇప్పటిదాకా అండర్ వరల్డ్ – దెయ్యం సినిమాలను తీసిన వర్మ… ఇటీవల రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాలతో హోరెత్తిస్తున్నారనే చెప్పక తప్పదు. ఈ సినిమాలు కూడా నిజ జీవితంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలను టార్గెట్ చేస్తూ వర్మ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఆ సంచలనాలు పరిధి దాటి కూడా వెళుతున్నాయని కూడా చెప్పక తప్పదు. తాజాగా ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడం – టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘోర పరాజయం పాలు కావడాన్ని నేపథ్యంగా తీసుకుని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ… ఈ సినిమాపై తనదైన శైలి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీవీ చర్చలో భాగంగా సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అంటూ వర్మ సంధించిన ట్వీట్ నిజంగానే ఘాటుకే ఘాటెక్కించిందన్న వాదన వినిపిస్తోంది.

టీవీ షోలో పాలుపంచుకున్న వర్మను జొన్నవిత్తుల ఓ ప్రశ్న సంధించగా.. వర్మ అసలు ఆ ప్రశ్ననే పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తే.. మండిపోయిన జొన్నవిత్తుల తనదైన శైలిలో వర్మను టార్గెట్ చేశారు. అయితే ఎంతైనా వివాదాలకే కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న వర్మ మాత్రం ఊరుకుంటారా? అందుకే… జొన్నవిత్తుల చేసిన కామెంట్లకు వర్మ ఓ రేంజిలో సమాధానం ఇచ్చేశారు. జొన్నవిత్తుల వ్యాఖ్యలకు వర్మ కౌంటర్ ఇచ్చారనే దానికంటే కూడా రచయితను ఏకంగా ఓ రేంజిలో ఆడిపోసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. జొన్నవిత్తుల పర్సనల్ లైఫ్ ను టచ్ చేసిన వర్మ…. ఆయనపై తనదైన మార్కు కామెంట్లు చేశారు. అసలు ఈ తరహా వ్యాఖ్యలు వర్మ నుంచి ఎదురవుతాయని కూడా జొన్నవిత్తులతో పాటుగా ఏ ఒక్కరు కూడా అనుకుని ఉండరన్న వాదన కూడా ఇప్పుడు వినిసిస్తోంది.

అయినా తన ట్వీట్ లో జొన్నవిత్తులను వర్మ ఏమని ఆడుకున్నారన్న విషయానికి వస్తే… ‘‘ ఓ బుజ్జి నా జొన్నా… నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్… నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ… లేకపోతే ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతావ్ జొన్నా.. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్… వాళ్ల మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్ కానీ ఐ లవ్ యూ డా’’ అంటూ నిజంగానే జొన్నవిత్తులపై వర్మ తనదైన రేంజిలో విరుచుకుపడ్డారు. అయినా వర్మ తీస్తున్న సినిమాపై ఓ ప్రశ్న సంధించినందుకే… జొన్నవిత్తులపై వర్మ ఈ రేంజిలో ఫైర్ కావడం చూస్తుంటే… కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాపై వర్మ ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా పెద్దగా వివాదాల జోలికే వెళ్లని జొన్నవిత్తులపై వర్మ ఈ రేంజిలో ఫైర్ అయిన నేపథ్యంలో… ఈ వ్యవహారం ఎంతదాకా వెళుతుందోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Please Read Disclaimer