పీకే ఫ్యాన్స్ శ్రద్ధాంజలి.. ఆర్జీవీ స్పందన

0

విరోధులపై ఆర్జీవీ ఎటాకింగ్ స్టైల్ గురించి తెలిసిందే. వెటకారాలు .. వ్యంగ్యం .. ఉడికించడం ఆయన శైలి. ఇవన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్.. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇటీవలే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు (కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు) చిత్రం రిలీజైంది. ఈ సినిమాలో పలువురు రాజకీయ నాయకులను జోకర్లుగా చూపించారు ఆర్జీవీ. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ కల్యాణ్ పైనా ఆర్జీవీ సెటైర్లు కాకలు పుట్టించింది.

ఈ నేపథ్యంలో వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన కోడూరుపేట యూత్ రంగంలోకి దిగి… వర్మకు శ్రద్ధాంజలి ప్రకటించారు. అందుకు సంబంధించిన బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. బూతులు తిడుతూ ఈనెల 26న వర్మ పెద్దకర్మ చేస్తున్నామని ప్రకటించారు. దీనికి ఆర్జీవీ నుంచి ధీటైన ఆన్సర్ వచ్చింది.

“పీకే.. సీబీఎన్.. లోకేష్ మద్ధతుదారులంతా నన్ను ఎవరైతే తిడుతున్నారో వారికి ఇదే నా విన్నపం… అమ్మ రాజ్యంలో సినిమాని దయచేసి అర్థం చేసుకోండి. ఈ సినిమాని కేవలం ఫన్ కోసం తీశాను. నిజానికి నేను వారి అభిమానుల్ని ఎంతగానో ప్రేమిస్తాను. కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి చెబుతున్నా“ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
Please Read Disclaimer