‘ఆమె’ నగ్నత్వంపై వర్మ కామెంట్స్

0

అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఆడై’ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ వర్షన్ తో పాటు తెలుగు వర్షన్ టీజర్ ను కూడా విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఆమె’ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. టీజర్ సినిమాపై చాలా ఆసక్తిని కలిగిస్తుంది. టీజర్ లో అమలాపాల్ పూర్తి నగ్నంగా ఉన్న షాట్స్ ను చూపించిన దర్శకుడు సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెప్పాడు. టీజర్ కు ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రముఖుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ టీజర్ పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. టీజర్ అద్బుతంగా ఉంది. మీరంతా కూడా తప్పకుండా చూడాల్సిన టీజర్ ఇది. టీజర్ లోని అమలాపాల్ ఎమోషనల్ మరియు నిజాయితీగా నగ్నంగా నటించింది. ఆ షాట్ లో ఆమె నిజాయితీ కనిపిస్తుంది. దర్శకుడు అద్బుతమైన షాట్స్ ను పెట్టాడంటూ వర్మ ‘ఆడై’ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీజర్ పై స్పందించడం మాత్రమే కాకుండా టీజర్ ను తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేయడం జరిగింది.

విడుదలైన వెంటనే భారీగా వ్యూస్ ను దక్కించుకున్న తమిళ మరియు తెలుగు వర్షన్ టీజర్ కు వర్మ ట్వీట్ తో మరింత బలం చేకూరినట్లయ్యింది. తమిళంలో ఇప్పటికే ఈ చిత్రంకు సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ బోర్డ్ వారు ఈ చిత్రంకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఒక తల్లి కూతురు కోసం పడే తపన మరియు ఒక అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసే వారికి ఎలా బుద్ది చెప్పిందనే సున్నితపు అంశాలను ఈ చిత్రంలో చూపించడం జరిగిందట.
Please Read Disclaimer