వర్మను కే.ఏ పాల్ టార్గెట్ చేయడానికి కారణం?

0

ఆర్జీవీ `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` రిలీజ్ ని వాయిదా వేయాలని ఇంతకుముందు క్రైస్తవ మత ప్రభోదకుడు కే.ఏ.పాల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు తీర్పు తనకే అనుకూలంగా వెలువడిందని పాల్ ఆనందం వ్యక్తం చేశారు. `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` టైటిల్ మార్పు సహా రిలీజ్ వాయిదా పడిన సంగతిని ప్రస్థావిస్తూ ఆయన రామ్ గోపాల్ వర్మ మారాలని.. ప్రజలకు సమాజానికి మంచి చేయాలని ఆకాంక్షించారు.

నాకు సినిమాలంటే తెలీదు. కానీ ఉదయం ఓ సినిమా చూశాను. అమీర్ ఖాన్ ఒక మూవీ తీశాడట. పీకే ఆ సినిమా పేరు. ఏ రెలిజియన్ ని కించపరచకుండా ఎవరినీ కించ పరచకుండా చాలా మంచి కలర్స్ ని ఎక్స్ పోజ్ చేస్తూ చక్కగా డీసెంటుగా తీశారు. అమెరికన్ స్టాండార్డ్ కి పనికొచ్చేంత మంచి మూవీ తీశారు. అలాంటి సినిమాలు ఎన్నో తీయాలని.. రక్త చరిత్ర.. లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటివి మానేసి చక్కనివి తీయాలని కోరుతున్నాను అన్నారు.

ఆర్జీవీ సినిమాని ఆపాలనుకోవడానికి కారణమేంటి? అని ప్రశ్నిస్తే దానికి రెండు కారణాలు ఉన్నాయని అన్నారు. ఆర్జీవీ సినిమా `రక్త చరిత్ర` నేను చూడలేదు కానీ మా టీమ్ చెప్పారు. పరిటాల రవి అనే రాజకీయనాయకుడిని చంపేస్తే దానిని అడ్వాంటేజ్ తీసుకుని సినిమా తీశాడు. `లక్ష్మీస్ ఎన్టీఆర్`కి చంద్రబాబు పర్మిషన్ ఇవ్వనేలేదు. ఇప్పుడు కమ్మ రెడ్డి మధ్య కలతలు పెడుతున్నారు. దానిని ఆపడం నా కర్తవ్యం అందుకే కేసు వేశాను.. అని అన్నారు.

కే.ఏ.పాల్ చంద్రబాబు మనిషి.. గత ఎన్నికల్లో బాబుకు సాయంగా పోటీ చేశారు. అందుకే బాబును సమర్ధిస్తూ సినిమాని ఆపుతున్నారా? అంటే అలాంటిదేమీ లేదని అన్నారు. 31 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ నేను తెలుగు ప్రజలపై ప్రేమతో చారిటీలు చేస్తున్నాను. విశాఖపట్నం భోగాపురం వద్ద 20 ఎకరాల స్థలంలో ఎంతో సామాజిక సేవ చేస్తున్నాను. రాజకీయాల్లో సేవ చేయాలనుకున్నానని పాల్ అనడం ఆసక్తికరం.
Please Read Disclaimer