కేఏపాల్ పంచులపై వర్మ సెటైర్

0

విలక్షణ రాజకీయ వేత్తల్లో కేఏ పాల్ ఒకరు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు.. ఎప్పుడు ఏం చేస్తారో కూడా అంతుబట్టదు. విచిత్రమైన వేషాలు భావవ్యక్తీకరణతో ఆకట్టుకుంటారు. తాజాగా కేఏపాల్ ఒక సంఘటన విషయంలో నవ్వులు పూయిస్తున్నారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పాల్ చేసిన పనిపై వర్మ వేసిన వ్యంగ్యాస్త్రాలు నవ్వులు పూయిస్తున్నాయి.

ఎన్నికలు దగ్గర పడడంతో ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించి జనంలోకి వెళుతున్నారు. అయితే తన విచిత్ర చేష్టలను మాత్రం వదులుకోవడం లేదు.. తాజాగా తన వాహనంలో ఎక్కడికో పాల్ ప్రయాణిస్తున్నారు. ముందు సీట్లో కూర్చొని బాక్సింగ్ ఆడుతున్నట్టు.. పక్కవారిని పడగొడుతున్నట్టు కొన్ని విచిత్రమైన చేష్టలు చేస్తూ కెమెరా కంటపడ్డారు. ఈ సంఘటనను పక్కకార్లో వెళుతున్న ఎవరో వీడియో తీయడం.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

తాజాగా ఈ వీడియోను షేర్ చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ విచిత్రమైన కామెంట్ ను పెట్టి పాల్ ను ఎండగట్టారు.. ‘ప్రపంచ దిగ్గజ బాక్సర్ ఈయనే.. మరో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ను మట్టి కరిపించిన హోలీఫీల్డ్ కు కేఏపాల్ బాక్సింగ్ లో శిక్షణ ఇచ్చాడని ఇప్పుడు ఈ వీడియో చూశాక తాను ఒప్పుకుంటున్నా’ అని కామెంట్ పెట్టి పాల్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. కారులోని కేఏపాల్ బాక్సింగ్ స్టెప్పులు నవ్వులు పూయిస్తున్నాయి.
Please Read Disclaimer