కమ్మరాజ్యం ట్రైలర్ డేట్..పవన్ పై సెటైర్!

0

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. వివాదాస్పద టైటిల్ కావడంతో మొదటిరోజు నుండే ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ఈ సినిమా నుండి ఆర్జీవీ ఒక పోస్టర్ షేర్ చేస్తూ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమానుండి ఒక పిక్ ఇది. దీపావళి బ్లెస్సింగ్స్ తో 28 వ తారీఖు ఉదయం 9.36 గంటలకు రిలీజ్ అవుతుంది. ఏ వ్యక్తి తో అయినా పోలికలు ఉంటే అది కాకతాళీయం మాత్రమే” అని ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పోలి ఉన్న వ్యక్తి తెలుపు లాల్చీ.. ఎర్ర కండువా భుజాన వేసుకొని ఆవేశంగా చే గువేరా తరహాలో చెయ్యి పైకెత్తి ప్రసంగిస్తూ ఉన్నారు. పవన్ పాత్రధారి దగ్గర ఇద్దరు బాడీగార్డులు.. కొందరు కార్యకర్తలు ఉన్నారు. వారితో పాటుగా పవన్ చుట్టూ ఐదుగురు ఛీర్ లీడర్స్ ఉత్సాహం ప్రకటిస్తున్నారు. ఆ ఛీర్ లీడర్స్ లో కొందరు ఫారినర్స్ కూడా ఉన్నారు. నేపథ్యంలో ఉన్న రెడ్ కలర్ సర్కిల్ చూస్తుంటే జనసేన లోగో తరహాలో ఉంది.

రామ్ గోపాల్ వర్మ ఈ పోలికలు అన్నీ అంత కో ఇన్సిడెంటల్ అన్నప్పటికీ పోస్టర్ మాత్రం పవన్.. ఆయన పార్టీ జనసేన ను గుర్తుచేసేలానే ఉంది. అయితే వారిలో ఛీర్ లీడర్స్ ను పెట్టడం మాత్రం వేళాకోళం చెయ్యడమే. వర్మ తన సినిమాల ప్రచారం కోసం ఏదో ఒక వివాదం రేపేందుకు.. అందులో చలికాచుకునేందుకు ప్రయత్నిస్తాడనే విషయం తెలిసిందే. ఈ పోస్టర్ ను చూసి పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే ఎంత వివాదం రేగుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer