‘ఎఫ్’ అంటే ఏంటో మరి అంటున్న ఆర్జివి!

0

రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు పెట్టింది పేరు. ఫుడ్ లేకుండా అయినా ఉంటాడేమో కానీ వివాదాలు లేకుండా మాత్రం ఉండలేడు. ఏదొక విధంగా సోషల్ మీడియాలో చర్చలకు తెరలేపుతుంటాడు. కానీ ప్రతి వివాదంలో కామన్ గా ఆయన వాడేది మాత్రం ట్విట్టర్. ట్విట్టర్ లో మాత్రం రామ్ గోపాల్ వర్మ ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటాడు. దేనికైనా ట్వీట్లతోనే స్పందిస్తాడు. ఈరోజు కూడా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసాడు.

అదేంటంటే.. “ది రోట్వేలేర్ – ది న్యూఫౌండ్ ల్యాండ్ అనే రెండు జాతుల పెంపుడు కుక్కలు నన్ను పీకేఎఫ్ – సీబీఎన్ ఎఫ్ – ఎల్బిఎఫ్ ల నుండి రక్షించడానికి ప్రొటెక్షన్ గా పెట్టుకున్నట్లుగా ఉంది అందులో విషయం. మరి ‘ఎఫ్’ అంటే అర్ధం ఏంటి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా వదిలేసాడు. దీన్ని బట్టి అర్ధం చేస్కోవచ్చు కదా.. ఆర్జివి ఎంత మొండి మనిషో.. బుర్ర ఉండే పెడుతున్నాడా ఈ ట్వీట్లు అని అనుమానం వచ్చినా ఆయన చేసేది చేస్తుంటాడు.

ఇక ఈ ట్వీట్ చదివిన ప్రతి ఒక్కరు పీకేఎఫ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని – సీబీఎన్ ఎఫ్ అంటే చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అని – ఎల్బిఎఫ్ అంటే లోకేష్ బాబు ఫ్యాన్స్ అని అనుకుంటున్నారు. మరి ఎఫ్ అంటే ఫ్యాన్స్ అనేది కరెక్టా.. కాదా..లేక ఎఫ్ అనే అక్షరానికి ఆయన వ్యూలో వేరే మీనింగ్ ఏమైనా ఉందా.. అనే విషయం చర్చనీయాంశం అయింది. రామ్ గోపాల్ వర్మ అనే మనిషి బుర్రలో ఏ అక్షరానికి ఏ అర్ధాలు దాగి ఉన్నాయో ఒక్కోసారి ఆయనకు కూడా క్లారిటీ లేదనిపిస్తుంది. ఏమైనా గుట్టు విప్పుతారేమో చూడాలి మరి..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-