మరో పాత జ్ఞాపకాన్ని షేర్ చేసిన వర్మ

0

మహమ్మారి వైరస్ కారణంగా జనాలంతా కూడా భయపడుతున్నా రామ్ గోపాల్ వర్మ మాత్రం కనీసం దాన్ని పట్టించుకుంటున్నట్లుగా అనిపించడం లేదు. తారలంతా కూడా షూటింగ్స్ మానేసి ఇంటికి పరిమితం అయిన సమయంలో వర్మ రెండు మూడు సినిమాలు పూర్తి చేసేలా ఉన్నాడు. ఇప్పటికే ఎన్ఎన్ఎన్ చిత్రాన్ని విడుదల చేసిన వర్మ ప్రస్తుతం మర్డర్ మరియు పవర్ స్టార్ చిత్రాలను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఇదే సమయంలో వర్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటున్నాడు.

ఎప్పుడు పాత ఫొటోలను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్ ను జత చేయడం పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవడం వంటివి చేస్తున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి పాత ఫొటోను షేర్ చేసి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించాడు. అనగనగా ఒక రోజు చిత్రం షూటింగ్ చివరి రోజు అంటూ వర్మ ఈ పిక్ ను షేర్ చేశాడు. ఇందులో నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఉన్నారు.

బ్రహ్మానందం మరియు చక్రవర్తి ఇంకా ఎంతో మంది నటులు మరియు నటీమణుల అప్పటి లుక్ ను ఇందులో చూడవచ్చు. జనాలను ఒక్కసారిగా కొంత కాలం క్రితంకు వర్మ తీసుకు వెళ్లాడు. ఎప్పుడు వివాదాస్పద అంశాలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పాత జ్ఞాపకాలను షేర్ చేస్తూ తనలో ఇంకా పాత వర్మ బతికే ఉన్నాడు అంటూ నిరూపించుకుంటున్నాడు.
Please Read Disclaimer