‘జీఎస్ టీ’ బ్యూటీకి ఆర్జీవీ క్యాప్షన్ వారెవ్వా!

0

వివాదాలతో సహజీవనం చేయడం ఆర్జీవీ స్టైల్. ప్రస్తుతం `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అంటూ అగ్రకులాల్ని కెలుకుతున్న ఆర్జీవీ .. నిరంతరం ఈ సినిమా గురించి ఏదో ఒక వేడెక్కించే అప్ డేట్ చెబుతూనే ఉన్నారు. ఇటీవలే ఈ సినిమాకి కాస్టింగ్ సెలక్షన్స్ అంటూ తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖుల ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అచ్చం అలాంటి డూప్ లు కావాలని కోరారు. ప్రస్తుతం ఆర్టిస్టుల్లో ఏ రాజకీయ నాయకుడితో తమ పోలికలు సూటవుతాయో! అంటూ ఎవరికి వారు సెల్ఫ్ లుక్ టెస్టులకు రెడీ అవుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ మాటేమో కానీ ఆయన మనసు `జీ.ఎస్.టి` కథానాయిక.. పోర్న్ స్టార్ మియా మల్కోవాపైకి మళ్లినట్టుంది. మియా మల్కోవా తన ట్విట్టర్ ఖాతాలో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ (శాండియాగో బీచ్) కి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేసి “మీరే క్యాప్షన్ పెట్టండి.. నచ్చితే దీన్ని రీట్వీట్ చేయండి“ అంటూ ఆఫర్ ఇచ్చింది. దీనికి వెంటనే స్పందించిన ఆర్జీవీ అంతే ట్రెండీ క్యాప్షన్ ని ఇచ్చాడు.

క్యాప్షన్ ప్లీజ్! అంటూ ఆఫర్ ఇస్తే వర్మ కాదంటాడా.. `ఇది దీర్ఘ చతురస్రాకార త్రికోణ ఒంపు సొంపుల ప్రేమ` అని క్యాప్షన్ ఇవ్వడం.. ఆ ఫోటోని రీట్వీట్ చేయడంతో అది కాస్తా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఆర్జీవీ ట్వీట్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్నట్టు మియా మల్కోవా జీవితకథను `గాడ్ సెక్స్ అండ్ ట్రూత్` పేరుతో డాక్యు సినిమా తీసిన ఆర్జీవీ యూట్యూబ్ లో నేరుగా రిలీజ్ చేసి భారీగా లాభాలార్జించాడు. పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు ఎక్కువ వచ్చిందన్న టాక్ వినిపించింది. ఆ క్రమంలోనే జీఎస్టీకి సీక్వెల్ తీస్తాడన్న ముచ్చటా సాగింది. బహుశా ఇప్పుడేమైనా అలాంటి ఆలోచన ఏదైనా చేస్తున్నాడా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
Please Read Disclaimer