అలా చేస్తే ‘ఆర్ఆర్ఆర్’ 2 గంటల్లో వెయ్యి కోట్లు వసూల్ చేస్తుంది: స్టార్ డైరెక్టర్

0

లాక్డౌన్ ప్రారంభంలో సినిమా థియేటర్లన్ని మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలలు గడుస్తున్నా మహమ్మారి ప్రభావం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇక ఇళ్లకు పరిమితం అయిన జనాలకు ఓటీటీ ఫ్లాట్ ఫాములు మంచి వినోదం అందిస్తున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. ఆహా.. హాట్ స్టార్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫాములకు మంచి ఆధారణ పెరుగుతోంది. రోజురోజుకి ఓటీటీలలో విడుదల అవుతున్న తెలుగు సినిమాల జాబితా కూడా అలాగే పెరుగుతుంది. కానీ మీడియం బడ్జెట్.. హై బడ్జెట్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు దర్శక-నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఎందుకంటే మా సినిమా ఓటీటీ సినిమా కాదు.. థియేటర్లలో చూడాల్సిన సినిమా అంటూ చెబుతున్నారు.

ఇక వివాదాల దర్శకుడు దర్శకుడు రాంగోపాల్ వర్మ సెపెరేట్ ఓటిటి ప్రారంభించి రచ్చ లేపుతున్నాడు. సినిమా బాగుంటే ఎక్కడైనా చూస్తారంటూ.. వర్మ తాజాగా ‘నగ్నం’ రిలీజ్ చేసాడు. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. “భవిష్యత్ ఓటీటీదే. అసలు థియేటర్స్ అంటూ ఉండవ్ అన్నారు. అంతేకాదు.. తన సినిమాలకి థియేటర్స్ లో వచ్చే కలెక్షన్స్ కన్నా ఓటీటీలోనే ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే కేవలం 2గంటల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తోంది. రాజమౌళికి ఉన్న క్రేజ్ తో అది సాధ్యం అవుతుందని తెలిపారు.

బాహుబలి తీసిన రాజమౌళి నుంచి వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనే ప్రచారంతో ఓటీటీలో భారీ కలెక్షన్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ ని ఓటీటీలో రిలీజ్ చేయమని జక్కన్నకి సలహా కూడా ఇచ్చారట వర్మ. మరీ.. వర్మ సలహాని రాజమౌళి పరిగణలోనికి తీసుకుంటారా ? లేదా అనేది చూడాలి” అంటున్నాడు. అంతేగాక “వరుస చిత్రాలతో దూసుకుపోతున్న రాజమౌళి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఫ్లాప్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగేతే ఇండస్ట్రీలో పార్టీ చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు” అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు. మరి ఆ పార్టీ చేసుకునే వాళ్లు ఎవరో.. అనేది చర్చలకు దారితీస్తుంది.
Please Read Disclaimer