ప్రభుత్వానికి వర్మ ఓ సలహా

0

సెన్షేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేస్తూ ఉండేవాడు. కాని ఈమద్య మాత్రం సామాజిక బాధ్యతతో కరోనా విషయంలో అవగాహణ పెంచే విధంగా ట్వీట్స్ చేస్తున్నాడు. ఆయన సామాజిక దూరం పాటించండి.. కరోనాకు దూరంగా ఉండండి అంటూ తనవంతు బాధ్యతగా ప్రచారం చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ ప్రకటించినా కూడా కొందరు బాధ్యతారాహిత్యంగా బయట తిరుగుతున్నారంటూ వర్మ అసహనం వ్యక్తం చేశాడు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు ఇక చివరి ప్రయత్నంగా ఆర్మీని దించాల్సిందే అన్నాడు. జనతా కర్ఫ్యూ సమయంలో కనిపించిన నిబద్దత ఇప్పుడు కనిపించడం లేదు. ఎవరు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. మూర్ఖంగా భయటకు వచ్చే వారిని అదుపులో ఉంచాలంటే ఆర్మీని రంగంలోకి దించాల్సిందే అంటూ ప్రభుత్వంకు వర్మ సలహా ఇచ్చాడు.

15 రోజులు ఇంట్లో ఉంటారా లేదంటే అయిదు సంవత్సరాలు జైల్లో ఉంటారా అంటూ రష్యా ప్రధాని ఆ దేశ ప్రజలను హెచ్చరించాడు. అలాగే మన పాలకులు కూడా బుద్దిగా ఇంట్లో ఉండకుంటే ఆర్మీ చేతిలో చావు దెబ్బలు తినక తప్పదు అంటూ హెచ్చరించాలంటూ ప్రభుత్వాలకు సూచించాడు. ప్రజలు ఎవరికి వారుగా ఇంట్లో ఉండక పోతే భవిష్యత్తులో తీవ్రమైన నష్టంను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వర్మ హెచ్చరించాడు. జనాలు ఇప్పటికైనా కరోనా మహమ్మారి తగ్గిపోయే వరకైనా ఇంటికే పరిమితం అవుతారేమో చూడాలి. లేదంటే ఆర్మీని రంగంలోకి దించే వరకు చూస్తారా..?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-