నటన లో డ్రాకులా.. వివాదాల RGV ప్రకంపనాలు

0

కమ్మ.. రెడ్డి.. కాపు! అంటూ సంచలనాలకు తెర తీశాడు ఆర్జీవీ. `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` చిత్రంలో ఏపీ రాజకీయాల్ని టచ్ చేస్తున్నాడు. రాజకీయ హత్యలు.. కులం కుట్రలు.. కుతంత్రాల్ని రివీల్ చేస్తున్నాడు. ఆ మేరకు ఇదివరకూ రిలీజ్ చేసిన టీజర్ సంచలనమైంది. ఇంతకుముందు .. చంద్రబాబు-లోకేష్ నాయుడు- వైయస్ జగన్- పవన్ కళ్యాణ్- కెఏ పాల్ పాత్రల్ని రివీల్ చేసిన ఆర్జీవీ.. `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కొత్త నటుడు` అంటూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ ని పెట్టాడు. ఆ కొత్త నటుడు మరెవరో కాదు.. రామ్ గోపాల్ వర్మనే!! అన్నది అసలైన ట్విస్టు.

తాజా ప్రకటనను బట్టి.. తెర వెనక నుంచి తెర ముందుకు వచ్చేస్తున్నాడు ఆర్జీవీ. ఆ సంగతిని ఆయనే ప్రకటించి షాకివ్వడంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు కెమెరా వెనక ఉండి ఆడుకున్న ఆర్జీవీ ఇక కెమెరా ముందుకు వచ్చి ఆటాడేయబోతున్నాడు. ఇంతకీ ఆర్జీవీ తన నిజ జీవిత పాత్ర (డైరెక్టర్) లోనే నటిస్తున్నాడా? అంటే అవుననే భావిస్తున్నారు.

దర్శకుడిగా వివాదాలు సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అయ్యాడు. ఇటీవల వాయిస్ వోవర్ల తోనే సెన్సేషన్స్ కి తావిస్తున్నాడు. ఇప్పుడు అతడు నేరుగా ముఖానికి మేకప్ వేసుకుని నటనలో కి వచ్చి ఎలాంటి సంచలనాలకు తావిస్తాడో! అన్న చర్చ మొదలైంది. `కమ్మరాజ్యం లో కడప రెడ్లు` ఈ నెలాఖరున రిలీజ్ కానుంది.
Please Read Disclaimer