ఇస్మార్ట్ హీరోపై ఆర్జీవి కన్ను.. అందోళనలో ఫ్యాన్స్!

0

‘ఇస్మార్ట్ శంకర్’ తో హీరో రామ్.. పూరి జగన్నాధ్.. ఛార్మీ.. మణిశర్మ ఇలా అందరికీ కరువు తీరిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి కాబట్టి సక్సెస్ విషయంలో మరో మాట లేదు. ఈ సినిమా హిట్ కావడంతో పూరి బౌన్స్ బ్యాక్ అయిన సంగతి నిజమే కానీ ఇప్పటికిప్పుడు స్టార్ హీరోలు పూరికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే రామ్ కు మాత్రం ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రామ్ మేకోవర్ ను.. పెర్ఫార్మెన్స్ ను ముక్తకంఠంతో పొగుడుతున్నారు.

రామ్ టాలెంట్ అందరికీ తెలుసు..ఆయన టాలెంట్ పై ఎవరికీ అనుమానాలు లేవు కానీ ఇలా విశ్వరూపం చూపించేసరికి రామ్ పై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. అలా అందరితో పాటుగా పూరి గురువుగారు రామ్ గోపాల్ వర్మ కన్ను కూడా పడిందట. రామ్ తో ఒక సినిమా చేయడమే ప్రస్తుతం ఆర్జీవి ఆలోచనట. రామ్ కు తన శిష్యుడు పూరి మేకోవర్ ఇచ్చినట్టే తను కూడా ఒక స్పెషల్ మేకోవర్ ఇవ్వాలని అలోచిస్తున్నాడట. ఈ ఉద్దేశంతోనే ‘ఇస్మార్ట్ శంకర్’ వేడుకల్లో జోరుగా పాల్గొంటూ సందడి చేస్తున్నాడని అంటున్నారు.

అయితే ఈ టాక్ బయటకు వచ్చిన సమయం నుండి రామ్ అభిమానులకు త్రీ ఫేజ్ కరెంట్ తో షాక్ ఇచ్చినట్టుగా వణికిపోతున్నారట. ఆర్జీవీ ఫామ్ ను కోల్పోయి కొన్నేళ్ళు అయింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి గరం మసాలా వివాదాల సినిమాలు సరే కానీ ఒక కమర్షియల్ సినిమాను ప్రేక్షకులు మెప్పించేలా ఎప్పుడు చివరిగా తెరకెక్కించాడో ఎవరికీ గుర్తు లేదు. పైగా అక్కినేని ఫ్యాన్స్ పై ‘ఆఫీసర్’ మిస్సైల్ తో చేసిన సర్జికల్ స్ట్రైక్ అలాంటిలాంటిది కాదు.

నిజానికి పూరి తో ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ రెడీ అయిన సమయంలోనే రామ్ అభిమానులు వద్దు మొర్రో అంటూ వేడుకున్నారు. కానీ రామ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ లో నటించాడు. కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించాడు. అయినా పూరి ఉన్న ఫామ్ వేరు.. ఆర్జీవీ ఫామ్ వేరు కాబట్టి ఆర్జీవీతో సినిమాకు రామ్ ఒప్పుకుంటాడని అనుకోలేం.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home