రాంగోపాల్ వర్మ జైలుకు వెళ్లడం ఖాయం..కేఏ పాల్

0

రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను థియేటర్లకు రాకుండా చేసి తీరుతానని.. తాను వేసిన పరువు నష్టం కేసులో డబ్బులు కట్టలేక ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని మత బోధకుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాంగోపాల్ వర్మ కులాల మధ్య తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే రీతిలో ఇలాంటి టైటిల్స్ పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారని.. కానీ దీనివల్ల శాంతియుత వాతావరనం చెడిపోతుందని అన్నారు.

తనను వ్యక్తిగతంగా అవమానించేలా ఈ సినిమాలో చిత్రీకరించినందుకు పరువు నష్టం దావా వేయడంతో పాటు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నందుకు ఒక పౌరుడిగా స్పందించి ఈ సినిమాను ఆపాలని కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు ఇస్తుందని – ఈ సినిమా థియేటర్లకు వెళ్లదని అన్నారు.

అంతేకాదు.. రాంగోపాల్ వర్మ తీరు కారణంగా ఆయనతో ఎవరూ సినిమా తీయడానికి ముందుకు రావడం లేదని.. నిర్మాతలు దొరకడం లేదని చెప్పారు. సినిమాలు తీయడం కోసం తన వద్దకు ఫండింగ్ కోసం వర్మ ఓసారి వచ్చాడని.. తనకు పాదసేవ కూడా చేసుకున్నాడని.. ఆయన తీరు నచ్చక తాను ఎలాంటి సహాయం చేయలేదని చెప్పారు.

తెలుగు సినిమా రంగంలో వర్మ కంటే ముందు నుంచి గొప్ప దర్శకులు ఉన్నా వారెవరూ ఇలాంటి టైటిల్ ఏ రోజూ పెట్టలేదని.. వారందరి కంటే వర్మ గొప్పోడా అని ప్రశ్నించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు – వందల కోట్లు కలెక్షన్ చేసిన సినిమాలు ఉన్నాయని… వారెవరూ ఇలాంటి చీప్ పనులతో కలెక్షన్లు సంపాదించలేదని.. మంచి సినిమాలు తీసి సంపాదించారని అన్నారు.
Please Read Disclaimer