రామ్ ఒకే పూరి సంగతేంటి ?

0

‘ఇస్మార్ట్ శంకర్’ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందేసుకున్న రామ్ నెక్స్ట్ ‘రెడ్’ అనే రీమేక్ సినిమాను సెట్స్ పై పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి లాంచ్ కంటే ముందే టెక్నీషియన్స్ ను ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. అయితే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం వేరే ఛాయిస్ లేకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ కి ప్లస్సయిన మణిశర్మనే డైరెక్టర్ కి రిఫర్ చేసాడు రామ్.

సొంత ప్రొడక్షన్ సినిమ కావడంతో కిషోర్ తిరుమల కూడా తనకి కలిసొచ్చిన దేవి శ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టి మరి రామ్ చెప్పినట్లే మణిశర్మకే ఓటేసాడు. అంతే కాదు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన జునైద్ నే రెడ్ కి కూడా తీసుకున్నాడు రామ్.

అయితే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న పూరి ‘ఫైటర్’ సినిమాకి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఫైనల్ అవ్వలేదు. సో రామ్ రూట్లోనే పూరి కూడా మణిశర్మకే ఫిక్సయిపోతాడా లేదా వేరే మ్యూజిక్ డైరెక్టర్ కి చాన్స్ ఇస్తాడా చూడాలి.
Please Read Disclaimer