రామ్ ‘రెడ్’ ఆలస్యం అయినా రేటు అదిరింది

0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘రెడ్’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. థియేటర్లు లేని కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నారు. ఓటీటీ వారు ఈ సినిమాకు ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసినా కూడా రామ్ మాత్రం థియేటర్ రిలీజ్ కు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఓటీటీ వైపు అస్సలు వెళ్లడం లేదు. తాజాగా ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అమ్మకం జరిగిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జెమిని టీవీ కొనుగోలు చేసింది.

శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కు గాను సన్ నెట్వర్క్ వారు ఏకంగా 13.5 కోట్ల రూపాయలను పెట్టిందట. దీంతో బడ్జెట్ సగానికి పైగా రికవరీ అయినట్లే అంటున్నారు. ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా నామమాత్రంగా వచ్చినా కూడా ‘రెడ్’ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకుంటే నిర్మాత స్రవంతి రవికిషోర్ కు మంచి లాభాలు రావడం ఖాయం అంటున్నారు.

రామ్ కిషోర్ తిరుమల కాంబో గత సినిమాల ట్రాక్ రికార్డు నేపథ్యంలో రెడ్ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేటు పలికే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేథా పేతురాజ్.. మాళవిక శర్మ మరియు అమృత అయ్యర్ లు హీరోయిన్స్ గా నటించారు.