దీనమ్మ కిక్కు.. అంటున్న ఉస్తాద్ శంకర్!!

0

పూరి జగన్నాధ్ సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ హిట్స్ గా నిలవలేదనే సంగతి నిజమే కానీ పూరి దర్శకత్వంలో ఒక స్పెషాలిటి మాత్రం ఇంకా మారలేదు. ఆయన దర్శకత్వంలో నటించిన హీరోను పూర్తిగా మార్చేస్తాడు. అందరూ ఒప్పుకునే విషయమే అది. పూరి సినిమా ‘పైసా వసూల్’ హిట్ కాలేదు కానీ బాలయ్య మేకోవర్ చాలామందికి నచ్చింది. ఇక పూరి తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను గుర్తు పట్టలేనంతగా మార్చాడు.

‘ఇస్మార్ట్ శంకర్’ జులై 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాను రామ్ చూడడం జరిగిందట. ఇక తన ఎగ్జైట్ మెంట్ ఆపుకోలేక ట్విట్టర్ ద్వారా “ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ చూశాను.. దీనమ్మ కిక్కు!! ఈ క్యారెక్టర్ చేస్తూ.. ఆ పాత్రను స్క్రీన్ పై చూస్తూ వచ్చిన కిక్కు చాలా హై. నాకు ఇలా కిక్కు ఇచ్చిన సినిమాను చూసి చాలాకాలం అయింది! థ్యాంక్ యు పూరి జగన్ గారు. మీరే అసలు డ్రగ్ అని చాలామందికి తెలియదు” అంటూ ట్వీట్ చేశాడు.

రామ్ ఇప్పటివరకూ చాలానే సినిమాల్లో నటించినా మాసు క్యారెక్టర్లు చేసినా.. ఇంత ఊరమాసు పాత్ర మాత్రం దాదాపు మొదటిసారే అని చెప్పవచ్చు. ఒక పక్కా లోకల్ ఓల్డ్ సిటీ అబ్బాయిగా.. లోకల్ స్లాంగ్ తో మాట్లాడడం రామ్ కు ఒక ఛాలెంజ్. అందుకే ఫుల్ గా ఎగ్జైట్ అయినట్టున్నాడు. ఈ సినిమా విజయం అటు రామ్ కు ఇటు పూరికి చాలా ముఖ్యం. మరి ప్రేక్షకులను కూడా ఈ సినిమా మెప్పిస్తుందా లేదా అనేది మనకు ఈ 18 వ తారీఖున తెలుస్తుంది.
Please Read Disclaimer