విక్రమ్ బర్త్ డే వేడుకలకు హాజరైన Mr.C

0

యూవీ క్రియేషన్స్ ఫౌండర్స్ వంశీ కృష్ణారెడ్డి.. ప్రమోద్ ఉప్పలపాటి.. విక్రమ్ రెడ్డి అనే సంగతి తెలిసిందే. వంశీ.. ప్రమోద్ ఇద్దరి పేర్లు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి కానీ విక్రమ్ రెడ్డి పేరు వినిపించడం కాస్త తక్కువే. అయితే ఇండస్ట్రీ సర్కిల్స్ లో మాత్రం ఆయన అందరికీ పరిచయమే. రీసెంట్ గా విక్రమ్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్ కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలకు సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు. రామ్ చరణ్ అయ్యప్పస్వామి దీక్షలో ఉండడంతో నలుపు రంగు దుస్తులతో నుదుటిన విభూతితో కనిపించారు. ఇక ఉపసాన పింక్ కలర్ డ్రెస్ లో సింపుల్ గా హాజరయ్యారు. ఈ వేడుకలకు చరణ్ క్లోజ్ ఫ్రెండ్ టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా హాజరవడం విశేషం. శర్వా బ్లాక్ కలర్ టీ షర్టు.. ఫేడెడ్ జీన్స్ ప్యాంట్.. క్యాప్ తో స్టైలిష్ గా కనిపించారు.

విక్రమ్ రెడ్డి.. అయన సతీమణితో కలిసి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బర్త్ డే పార్టీని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు.
Please Read Disclaimer