వర్మ నెక్ట్స్ ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’

0

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు తెరకెక్కించిన సినిమాను వివాదాస్పదం చేసేవాడు. కాని ఇప్పుడు వివాదాస్పద అంశాలను తీసుకుని మరీ సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కొన్ని పార్టీల నాయకులు తమ అధినేతలకు వ్యతిరేకంగా ఉంది అంటూ వర్మపై తిట్లదండకం అందుకున్నారు. కాని వర్మ అవేవి పట్టించుకోకుండా తన పనేదో తాను చూసుకుంటున్నాడు.

ఇటీవల తెలుగు దేశం పార్టీకి ఎమ్మెల్యే వలభనేని వంశీ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైకాపాలో జాయిన్ అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈ సందర్బంగా వంశీ కొన్ని టీవీ ఛానెల్స్ చర్చా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సందర్బంగా టీడీపీపై మరియు ఆ పార్టీ నాయకులపై విరుచుకు పడ్డాడు. ఆ వీడియోలను చూసిన వర్మకు కొత్త సినిమా చేయాలనే ఆలోచన కలిగిందట.

వర్మ ట్విట్టర్ లో ఇదే విషయాన్ని ప్రకటించాడు. వంశీ స్పీచ్ చూసిన తర్వాత కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్ తీయాలనిపిస్తుంది. దానికి రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ అనే టైటిల్ ను పెడతాను అంటూ వర్మ ప్రకటించాడు. వర్మ గతంలో ఎన్నో సినిమాలను ప్రకటించి వదిలేశాడు. కాని ఈమద్య కాలంలో ఆయన ప్రకటించిన సినిమాలను చేసే తీరుతున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేయడని అంతా అనుకున్నారు. కాని దాన్ని తీసి విడుదల చేసి చాలా పెద్ద కాంట్రవర్శీ చేశాడు.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాను కూడా వర్మ ప్రకటించినప్పుడు ఏం తీస్తాడులే అనుకున్నారు. కాని అది కూడా పూర్తి అయ్యింది. త్వరలో విడుదల కాబోతుంది. ఇప్పుడు రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ కూడా తప్పకుండా తీస్తాడేమో అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఆ సీక్వెల్ లో వర్మ మరెంత మందికి చుక్కలు చూపిస్తాడో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer