బన్ని కోసం రూల్స్ బ్రేక్ చేసిన రామోజీ

0

తెలుగు మీడియాని దశాబ్దాలుగా శాసిస్తున్న ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు వ్యవహార శైలి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఈనాడు పత్రికా రంగంలో అగ్రపథాన పయనిస్తోంది అంటే కొన్ని విలువల్ని పాఠించడం వల్లనే. అయితే ఇటీవల ఈనాడులో గతి తప్పిన వార్తల గురించి ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక సెక్షన్ కి మాత్రమే రుచించే వార్తల్ని ఈనాడులో వేస్తున్నారన్న విమర్శలు పోటెత్తుతున్నాయి. ఇక మరో విచిత్రం ఈనాడు పత్రికలో తాజాగా చోటు చేసుకుంది. గత ఇరవై ఏళ్లుగా ఈ సంస్థ తమ పేపర్ లో సినిమా ప్రకటనలు వేయకూడదని అనధికారికంగా ఓ రూల్ ని పాస్ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఎలాంటి సినిమా యాడ్ లు లేకుండా పత్రికని నడుపుతూ వచ్చింది.

ఇరవై ఏళ్లుగా ఈ రూల్ ని పాటిస్తూ బిగ్ షాక్ ఇచ్చిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత కొత్తగా తన రూల్ తానే బ్రేక్ చేయడం ఆసక్తికరంగా మారింది. సినిమా పేజ్ లో ఏనాడూ సినిమా యాడ్ లకు అవకాశం ఇవ్వని ఈనాడు సంస్థ…. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం తమ రూల్ ని బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `అల వైకుంఠపురములో` కోసం నియమాన్ని ఉల్లంఘించడం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సోమవారం సాయంత్రం.. అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సెర్ట్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అందుకు సంబంధించిన ఈనాడు దినపత్రిక సినిమా పేజీలో ఒక పెద్ద ప్రకటన ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ప్రచురించిన పత్రికలో క్వార్టర్ పేజీ సైజ్ లో `అల వైకుంఠపురములో` యాడ్ కనిపించడం పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో మారుతి రూపొందించిన `ఈ రోజుల్లో` చిత్రానికి చిన్న స్ట్రిప్ యాడ్ కు మాత్రమే అనుమతినిచ్చి ఆశ్చర్యపరిచిన ఈనాడు ఈసారి అల్లు అర్జున్ సినిమా యాడ్ కోసం తమ పేజీలో క్వార్టర్ పేజీని కేటాయించడం మారుతున్న ఈనాడు స్ట్రాటజీకి ప్రతీకగా కనిపిస్తోందని పలువురు మాట్లాడుకుంటున్నారు. మునుముందు ఈనాడు సినిమా పేజీలో ప్రకటనలు పెరగడం ఖాయంగా ముచ్చటించుకుంటున్నారు. ఇది ఊహించని పరిణామమే మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-